Aamir Khan: అభీ... ఆమిర్ దిల్ మే గౌరీ
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:44 AM
సెర్చ్ ఇంజన్లన్నీ బిజీ అయిపోయాయి. ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలని సినీ అభిమానులు తహతహలాడారు. ఆమెతో తన అనుబంధం గురించి చెబుతూ ‘కభీ కభీ మేరే దిల్ మే...’ అంటూ పాట కూడా పాడారు ఆమిర్. ఇంతకీ ఎవరామె?

‘‘ప్రస్తుతం ఒక మహిళతో డేటింగ్ చేస్తున్నా...’’ అంటూ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ముంబయిలో గురువారం తన ప్రీ బర్త్‌డే మీడియా సమావేశంలో ప్రకటించి, ఆమె పేరు చెప్పగానే... సెర్చ్ ఇంజన్లన్నీ బిజీ అయిపోయాయి. ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలని సినీ అభిమానులు తహతహలాడారు. ఆమెతో తన అనుబంధం గురించి చెబుతూ ‘కభీ కభీ మేరే దిల్ మే...’ అంటూ పాట కూడా పాడారు ఆమిర్. ఇంతకీ ఎవరామె?
బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ చేసిన చిన్న ప్రకటనతో.. ఒక్క పూటలోనే సెలబ్రెటీగా మారిపోయారు గౌరీ స్ర్పాట్. నిజానికి గురువారం సమావేశానికి ఒక రోజు ముందు తన ఇంట్లో ఏర్పాటు చేసిన ప్రీ బర్త్‌డే డిన్నర్ పార్టీలో గౌరీని తోటి సూపర్‌స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్‌ఖాన్‌లకు అమీర్ పరిచయం చేశారు. ప్రస్తుతం అమీర్‌తో సహజీవన బంధంలో ఉన్న గౌరి అతనికి చిరకాల మిత్రురాలే. ఆమె స్వస్థలం బెంగళూరు. తల్లి రీటా స్ర్పాట్ ఆ నగరంలో ప్రసిద్ధి చెందిన ‘స్ర్పాట్ సెలూన్’ నిర్వాహకురాలు. ఆమె తాత స్వాతంత్య్ర సమరయోఽధుడు. గౌరీ ‘బ్లూ మౌంటెన్’ స్కూల్లో చదువుకున్నారు. ఫ్యాషన్ విభాగంలో ఉన్నత విద్య అభ్యసించారు. 2004లో లండన్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ ది ఆర్ట్స్’లో స్టయిలింగ్ ్క్ష ఫొటోగ్రఫీ కోర్సు పూర్తిచేశారు. ప్రస్తుతం తల్లి బాటలోనే ముంబయిలో ‘బి బ్లంట్’ సెలూన్‌ను నిర్వహిస్తున్నారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్‌లో కూడా పనిచేస్తున్నారు. గౌరీకి ఇప్పటికే ఆరేళ్ల కొడుకు ఉన్నాడు. అమిర్‌తో ఆమె స్నేహం 25 ఏళ్ల నాటిది. ఏడాదిన్నర నుంచి వీరి స్నేహం మరింత బలపడి అందమైన అనుబంధంగా మారింది
ఇంతకుముందు...
సామాజిక సమస్యలు ప్రధాన ఇతివృత్తంగా రూపొందిన పలు సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందిన ఆమిర్ ఖాన్... తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులతోపాటు 2003లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్ పురస్కారాలు, చైనా ప్రభుత్వం నుంచి గౌరవ పురస్కారం అందుకున్నారు. అతనికి గతంలో రెండు పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటి భార్య రీనా దత్తా. వీరు 1986లో వివాహం చేసుకున్నారు. 2002లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. పెళ్లి నాటికి రీనా వయసు 19 ఏళ్లు కాగా ఆమిర్ వయసు 21 ఏళ్లు. వీరికి కొడుకు జునైద్ ఖాన్, కూతురు ఐరా ఖాన్ ఉన్నారు. జునైద్ ఇటీవలే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే పలు చిత్రాల్లో సహాయ దర్శకుడిగా పనిచేసి పేరు తెచ్చుకున్నాడు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. ఐరా ఖాన్ ఈ మధ్యే ఫిట్‌నెస్ కోచ్ నుపుర్ శిఖారేను పెళ్ళి చేసుకుంది. మానసిక ఆరోగ్య సమస్యలపై రూపొందించిన ఒక నాటకం ఆమెకు ప్రశంసలను తెచ్చిపెట్టింది.
‘లగాన్’తో మొదలై...
ఆమిర్ రెండో భార్య కిరణ్ రావు. ‘లగాన్’ సెట్స్ మీద మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి, 2005లో వివాహం చేసుకున్నారు. అభిప్రాయ భేధాలతో 2021లో విడాకులు తీసుకున్నారు. పెళ్లి నాటికి కిరణ్ వయసు 32 ఏళ్లు. ఆమె ప్రముఖ దర్శకురాలు, నిర్మాత, స్ర్కీన్‌ప్లే రచయిత. వీరి కొడుకు ఆజాద్ రావు ఖాన్ 2011లో సరోగసీ ద్వారా జన్మించాడు. అతను ఎక్కువగా కుటుంబ వేడుకల్లో కనిపిస్తాడు. మీడియాకు దూరంగా ఉంటాడు. రీనా, కిరణ్ ఇద్దరితోనూ స్నేహాన్ని ఆమిర్ కొనసాగిస్తున్నారనీ, పిల్లలందరినీ ప్రేమగా చూసుకుంటాడనీ చెబుతారు. పిల్లలకు వ్యక్తిగతంగా సలహాలు, వృత్తిపరంగా సూచనలు ఇస్తూ తండ్రిగా మార్గనిర్దేశనం చేస్తూ ఉంటారు. గౌరీతో బంధాన్ని ఆమిర్ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా అంగీకరించడం విశేషం.
ఆమిర్‌కు గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య రీనా దత్తా. వీరు 1986లో వివాహం చేసుకున్నారు. 2002లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.