Share News

Cooler: పాత కూలర్‌ వాడుతున్నారా?

ABN , Publish Date - Mar 15 , 2025 | 01:28 AM

వేసవికాలంలో ప్రతి ఇంట్లో కూలర్లు ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని మూడు లేదా నాలుగేళ్లు వాడిన తరవాత గాలి చల్లగా రావడం లేదంటూ కొత్త కూలర్‌ కొనాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలాకాకుండా పాతదాన్నే కొత్తగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.

Cooler: పాత కూలర్‌ వాడుతున్నారా?

పాత కూలర్‌ను ఉపయోగించే ముందు దాన్ని శుభ్రం చేయాలి. లోపల ఫ్యాన్‌కి పట్టి ఉన్న బూజు దులిపి రెక్కలను తడి వస్త్రంతో తుడవాలి. ఫ్యాన్‌లో ఏదైనా సమస్య ఉంటే కొత్తదాన్ని తెచ్చి బిగిస్తే సరిపోతుంది.

కూలర్‌కు మూడు వైపులా అమర్చి ఉండే గడ్డి షీట్ల వల్లే గదిలో చల్లదనం విస్తరిస్తుంది. గత ఏడాది వాడిన కూలర్‌ను చాలాకాలం పక్కన పెట్టి ఉంచడం వల్ల వాటిపై దుమ్ము, ధూళి చేరి ఉంటాయి. వీటిని శుభ్రం చేసినప్పటికీ గదిలో చల్లదనం వ్యాపించదు. కాబట్టి కొత్త షీట్స్‌ తెచ్చి అమర్చుకుంటే తాజా గాలి వీచి ఇల్లంతా చల్లగా ఉంటుంది.

పాత కూలర్‌ నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. నీళ్లు బయటికి వస్తున్నచోట ఎంసీల్‌ను పూతలా రాస్తే సమస్య తీరుతుంది.

కూలర్‌ లోపల నీళ్లు నిల్వ ఉండేచోటుని శుభ్రంగా కడగాలి. మోటార్‌, వాటర్‌ పంప్‌, ఫ్లోటింగ్‌ బాల్‌లను పరిశీలించాలి. కూలర్‌ ముందు భాగంలో ఉండే ఎయిర్‌ ఫిల్టర్స్‌ని దుమ్ము లేకుండా పలుచని వస్త్రంతో తుడవాలి. కూలర్‌ని వాడుతున్నంతకాలం వారానికి ఒకసారి తుడవాలి.


ఇవి కూడా చదవండి..

BS Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎంకు స్వల్ప ఊరట

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Bengaluru: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

Divya: నటుడు సత్యరాజ్‌ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

Updated Date - Mar 15 , 2025 | 01:28 AM