Sweet Potato: చామదుంపలతో లాభాలెన్నో!
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:19 AM
కొద్దిగా నలుపు కలిసిన ఎరుపు రంగును చామనచాయ అంటారు. అలాంటి రంగు ఉన్న దుంపలు కాబట్టి వీటిని చామ దుంపలు అంటారు. దీని పైన ఉండే తొక్క చామనచాయగా ఉంటుంది. కానీ దానిలోని దుంప తెల్లగా ఉంటుంది.

దుంపలు అనేక రకాలు. వీటిలో చామదుంపలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ముందుగా వాటికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కొద్దిగా నలుపు కలిసిన ఎరుపు రంగును చామనచాయ అంటారు. అలాంటి రంగు ఉన్న దుంపలు కాబట్టి వీటిని చామ దుంపలు అంటారు. దీని పైన ఉండే తొక్క చామనచాయగా ఉంటుంది. కానీ దానిలోని దుంప తెల్లగా ఉంటుంది. దీనిలో ఎక్కువగా పిండి పదార్థాలు ఉంటాయి. అందువల్ల భోజన కుతూహలం గ్రంధం దీనిని ’పిండాలూ దుంప‘ అని పేర్కొంది. ఈ దుంపల్లో బి విటమిన్, ఇనుము, జింకు,భాస్వరం, రాగి, మాంగనీసు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. కొంత భాగం ఆహార పీచు కూడా ఉంటుంది. అందువల్ల త్వరగా అరుగుతాయి. ఇక ఆయిర్వేద గ్రంధాల ఆధారంగా చూస్తే
ఇవి రక్తస్రవాన్ని అరికడతాయి. కాలేయం సంబంధింత వ్యాధుల్లో బాగా పనిచేస్తాయి. కాలేయ వాపును తగ్గిస్తాయి.
ఈ దుంపలను ఉడికించినప్పుడు జిగురు ఎక్కువ అవుతుంది. ఈ జిగురు నరాల బలహీనతను తగ్గిస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
చేమ దుంపలు శరీరానికి చలవ చేస్తాయి. మూత్రం సాఫీగా కావటానికి తోడ్పడతాయి. మధుమేహ వ్యాధి ఉన్నవారిలో అరికాళ్లు, అరిచేతుల్లో మంటలు ఉంటాయి. వీటిని చేమ దుంపలు తగ్గిస్తాయి.
చేమ దుంపలు శరీరానికి పునరుత్తేజం పొందటానికి ఉపయోగపడతాయి. సూర్యరశ్మి వలన కలిగే నష్టాలను అరికడతాయు.
అందుకే వేసవిలో చేమ దుంపలను ఎక్కువగా తినమని ఆయిర్వేద వైద్యులు చెబుతూ ఉంటారు.
గంగరాజు అరుణాదేవి