Share News

Summer Makeup: వేసవిలో చెక్కుచెదరకుండా...

ABN , Publish Date - Mar 15 , 2025 | 01:34 AM

వేసవిలోఉక్కపోతకు మేకప్‌ చెదిరిపోయే ఇబ్బందులు ఎక్కువే! ఈ కాలంలో చర్మం జిడ్డుగా మారిపోకుండా తాజాగా ఉంచే మేకప్‌ ఉత్పత్తులను వాడుకోవాలి. అందుకోసం జెల్‌ ఆధారిత మాయిశ్చరైజర్‌, సన్‌స్ర్కీన్‌లను పూసుకుని, అవి పూర్తిగా చర్మంలోకి ఇంకిపోయాకే మేకప్‌ వేసుకోవాలి.

Summer Makeup: వేసవిలో చెక్కుచెదరకుండా...

ప్రైమర్‌: చర్మ రంథ్రాలను దాచడంతో పాటు మేక్‌పను పట్టి ఉంచే స్వభావం కలిగిన ప్రైమర్‌ మేక్‌పలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రత్యేకించి వేసవిలో వాటర్‌ప్రూఫ్‌ ప్రైమర్‌ ఎంచుకోవాలి. ఒకవేళ జిడ్డు చర్మం అయితే, మ్యాటిఫయింగ్‌ ప్రైమర్‌ను ఎంచుకోవాలి. ఈ ప్రైమర్‌ చర్మం మీద నిమిషం పాటు సెట్‌ అయ్యే వరకూ ఆగి, ఆ తర్వాతే బేస్‌ మేకప్‌ మొదలుపెట్టుకోవాలి.

బేస్‌ మేకప్‌: అన్ని ఫౌండేషన్‌లూ, కన్‌సీలర్లు వేసవి వేడిని తట్టుకోలేవు. కాబట్టి కరిగిపోకుండా ఉండడం కోసం వీటిని తక్కువ మోతాదులో వీలైనంత పలుచగా పూసుకోవాలి. వీటిని వద్దనుకొంటే టింటెడ్‌ మాయిశ్చరైజర్‌ వాడుకోవచ్చు. షీర్‌, మీడియం కవరేజ్‌, లైట్‌ వెయిట్‌ అనే మూడు రకాల టింటెడ్‌ మాయిశ్చరైజర్స్‌, చర్మం తాజాగా కనిపించేలా చేస్తాయి.


సెట్టింగ్‌ పౌడర్‌: కష్టపడి మేకప్‌ వేసుకున్న తర్వాత సెట్టింగ్‌ పౌడర్‌ వాడుకోకపోతే, శ్రమంతా వృథా అవుతుంది. తేలికగా జిడ్డుగా మారే వీలున్న ప్రదేశాలను పౌడర్‌తో సెట్‌ చేసుకోకపోతే, మేకప్‌ చెదిరిపోతుంది. కాబట్టి ముక్కు, చెక్కిళ్లు, చుబుకం.. ఈ ప్రదేశాల్లో సెట్టింగ్‌ పౌడర్‌ అద్దుకోవాలి. అందుకోసం ఫ్లఫ్ఫీ బ్రష్‌ మాత్రమే ఉపయోగించాలి. అర నిమిషం తర్వాత, బ్రష్‌తో అదనపు పౌడర్‌ను దులిపేసుకుంటే మేకప్‌ ఎక్కువ సమయం ఉంటుంది.

స్మడ్జ్‌ప్రూఫ్‌ లిప్‌స్టిక్‌: ఈ కాలంలో ఎక్కువ సమయం నిలిచి ఉండే ద్రవరూప లిప్‌స్టిక్స్‌ ఎంచుకోవాలి. ఇవి అద్దుకున్న క్షణాల్లోనే ఆరిపోయి, రోజంతా నిలిచి ఉంటాయి.

బ్లాటింగ్‌ పేపర్‌: ఎన్ని జాగ్రత్తలు పాటించినా వేసవిలో ఉక్కపోత ఎంతోకొంత తప్పదు. దాంతో మేకప్‌ చెదిరిపోకుండా ఉండడం కోసం బ్లాటింగ్‌ పేపర్స్‌ అందుబాటులో ఉంచుకోవాలి. రుమాలు, టిష్యూ పేపర్లకు బదులుగా ఈ బ్లాటింగ్‌ పేపర్‌ను ఉపయోగించుకోవడం వల్ల మేకప్‌ చెదిరిపోదు. చమట కూడా క్షణాల్లో మాయం అవుతుంది.


ఇవి కూడా చదవండి..

BS Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎంకు స్వల్ప ఊరట

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Bengaluru: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.. విషయం ఏంటంటే..

Divya: నటుడు సత్యరాజ్‌ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

Updated Date - Mar 15 , 2025 | 01:34 AM