Makeup: రాత్రి వేడుకల్లో వెలిగిపోయేలా...
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:10 PM
పగటి వెలుగుకూ, రాత్రి వేళ లైట్ల వెలుగుకూ తేడా ఉంటుంది. కాబట్టి ఆ వెలుగుకు తగ్గట్టు మేకప్ వేసుకుంటే సహజసిద్ధ అందంతో మెరిసిపోవచ్చు. అందుకోసం...

లిప్‌స్టిక్: పగటి వేళ న్యూడ్, బీజ్ లాంటి రంగులతో వీలైనంత తేలికపాటి మేకప్‌తో సరిపెట్టుకోవచ్చు. కానీ రాత్రి వేళ లేత రంగులు లైట్ల వెలుగుకు వెలాతెలా పోతాయి. కాబట్టి ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్స్ మాత్రమే ఎంచుకోవాలి. ఎరుపు, ముదురు గోధమ రంగు లిప్‌స్టిక్స్ బాగుంటాయి.
ఐ షాడో: లైట్ల వెలుగుకు ఐషాడో ప్రతిఫలించేలా చూసుకోవాలి. అందుకోసం గ్లిట్టర్ వాడుకోవాలి. నీలం, పర్పుల్ గ్లిట్టర్స్ రాత్రి వేళ వేడుకలకు ఎంతో బాగా నప్పుతాయి. ఇవి ధరించే డ్రస్సుతో సరిపోయేలా చూసుకోవాలి.
చెక్కుచెదరకుండా: మేకప్ చెక్కుచెదరకుండా ఉండడం కోసం మేకప్ సెట్టింగ్ స్ర్పే వాడుకోవాలి. లేదంటే, ఫౌండేషన్ మీద కాంపాక్ట్ పౌడర్ అద్దుకోవాలి. అలాగే బేస్ చెదిరిపోకుండా ఉండడం కోసం కొంత ఫౌండేషన్, బ్యూటీ బ్లెండర్ కలిపి వాడుకోవాలి.
ఐలైనర్: మేకప్ (లుక్ అదిరిపోవాలంటే కనురెప్పలకు నియాన్ ఐలైనర్ వేయాలి.
చెక్కినట్టు: ముక్కు, చుబుకం, కనుబొమలు స్పష్టంగా చెక్కినట్టు కనిపించడం కోసం బ్రాంజర్‌తో కాంటూర్ చేసుకోవాలి.
బ్లషర్: సాధారణంగా బ్లషర్ కొన్ని గంటలకే చెదిరిపోతూ ఉంటుంది. కాబట్టి చెక్కిళ్లకు కూడా బ్లషర్ అప్లై చేయడం మర్చిపోకూడదు.
ఐ ల్యాషెస్: కృత్రిమ కనురెప్పలు ఉపయోగించవచ్చు. ఇష్టం లేకపోతే డ్రమాటిక్ మస్కారా అప్లై చేయాలి.
హైలైటర్: చెక్కిళ్లు, బ్రో బోన్ మీద అద్దుకోవాలి.
ఇవి కూడా చదవండి:
Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు
Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా
MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే