Share News

Pollution Control: విపత్తు నిర్వహణకు నైట్‌ విజన్‌ డ్రోన్లు

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:27 AM

వాయు కాలుష్యాన్ని ముందుగానే గుర్తించి దాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ఆ పరికరాలు ఇచ్చే ఇన్‌పుట్స్‌ ఉండాలని చెప్పారు. వేసవిలో అత్యధిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Pollution Control: విపత్తు నిర్వహణకు నైట్‌ విజన్‌ డ్రోన్లు

రసాయన కర్మాగారాల వద్ద గాలి నాణ్యత పరికరాలు

తీరప్రాంతాల్లో తహశీల్దార్‌, కలెక్టర్లకు శాటిలైట్‌ ఫోన్లు

రెవెన్యూ, విపత్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా

అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హానికర, రసాయన కర్మాగారాల సమీపంలో గాలి నాణ్యత పర్యవేక్షణ పరికరాలను ఏర్పాటు చేయాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌.పి. సిసోడియా ఆదేశించారు. వాయు కాలుష్యాన్ని ముందుగానే గుర్తించి దాన్ని నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ఆ పరికరాలు ఇచ్చే ఇన్‌పుట్స్‌ ఉండాలని చెప్పారు. వేసవిలో అత్యధిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున విపత్తు నిర్వహణ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు పరిశ్రమలు, కర్మాగారాలు కూడా విపత్తు నిర్వహణ విధానాలను సర్వం సిద్ధంగా ఉంచుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణపై తాడేపల్లిలోని రాష్ట్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కార్యాయంలో సమావేశం జరిగింది.


ఇందులో సిసోడియా మాట్లాడారు. ప్రమాదాలు, ఇంకా ఊహించని భారీ విపత్తులు వచ్చినప్పుడు వాటిని అధిగమించేందుకు నైట్‌ విజన్‌ (రాత్రిళ్లు కూడా స్పష్టంగా కనిపించే) డ్రోన్‌లను సమకూర్చుకోవాలని ఆయన విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. అవసరమైన డ్రోన్‌ పైలట్లను ఎంప్యానల్‌ చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. తీరప్రాంతాల్లో విపత్తుల సమయంలో తహశీల్దార్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు శాటిలైట్‌ఫోన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే, ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో అమలవుతున్న డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్టులో.. ఇప్పటిదాకా చేసిన ఖర్చులు, ఉన్న పరికరాలు, ప్రస్తుతం వినియోగంలో ఉన్నవాటి గురించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సిసోడియా అదేశించారు. సమావేశంలో విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌ కూర్మనాథ్‌, అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..


WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 04:27 AM