Share News

Cotton Farming,: బట్టకట్టాలంటే ‘పత్తి’ బతకాలి

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:30 AM

అఖిల భారత పత్తి వార్షిక సమావేశం-2025లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘పత్తి సాగు విస్తీర్ణం భారతదేశంలో పూర్తిగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Cotton Farming,: బట్టకట్టాలంటే ‘పత్తి’ బతకాలి

నాగ్‌పూర్‌ ఐసీఏఆర్‌ - సీఐసీఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి. ప్రసాద్‌

గుంటూరు సిటీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): మానవాళి మనుగడకు అత్యవసరమైనవి అయిన కూడు, గూడు, దుస్తులకు కొరత లేకుండా చూేస్త దేశంలోని శాస్త్రవేత్తలు సఫలీకృతులు అయినట్లే అని నాగ్‌పూర్‌ ఐసీఏఆర్‌-సీఐసీఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.ప్రసాద్‌ అన్నారు. అఖిల భారత పత్తి వార్షిక సమావేశం-2025లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘పత్తి సాగు విస్తీర్ణం భారతదేశంలో పూర్తిగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమావేశం ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి దిక్సూచి అవుతుందని ఆశిస్తున్నాను. ఒకప్పుడు 90 లక్షల దూది బేళ్లు ఇతర దేశాలకు ఎగుమతి చేసిన చరిత్ర మన దేశానిది. ప్రస్తుతం దేశం 30 లక్షల దూది బేళ్లను దిగుమతి చేసుకుంటోంది. రైతులు పత్తి సాగు నుంచి మళ్లిపోవడానికి గల కారణాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. కాలానికి అనుగుణంగా అన్నిటినీ తట్టుకునే వంగడాలు రావాలి. కాటన్‌ మిషన్‌-2లో కేవలం బీటీ మీదే ఆధారపడకుండా వాతావరణ మార్పులు తట్టుకునే వంగడాలపైనా శ్రద్ధ పెట్టాలి. రైతులు కూడా తక్కువ వ్యవధిలో పంట చేతికి వచ్చే రకాలను ఎంచుకోవాలి. సాగు విధానంలో మార్పులు వస్తేనే పత్తి లాభసాటిగా ఉంటుంది. హైడెన్సిటీ పత్తి సాగు, యాంత్రీకరణపై కూడా దృష్టి సారించాలి. పొడుగు పింజ పత్తిని సాగు చేయటం మంచిది. ఇక ఆంధ్రాలో సాగు విస్తీర్ణం తగ్గిపోవడం బాధ కలిగించే అంశం. రాష్ట్రంలో పూర్వవైభవం సాధించే దిశగా ప్రయత్నాలు జరగాలి. అందుకు శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు కృషి చేయాలి’’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Gmail: జీ మెయిల్ నుంచి కొత్త ఏఐ ఫీచర్..ఆ పనులు చేయడంలో కూడా హెల్పింగ్..


WhatsApp: దేశంలో కోటి వాట్సాప్ ఖాతాలు తొలగింపు..ఇలా చేస్తే మీ అకౌంట్ కూడా..

NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ


Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 23 , 2025 | 04:30 AM