TANA: తానా మహాసభలు.. సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
ABN , Publish Date - Mar 19 , 2025 | 02:27 PM
డిట్రాయిట్‌లో జరగనున్న తానా మహాసభలకు రావాల్సిందిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తానా కాన్ఫరెన్స్ నేతలు ఆహ్వానించారు

ఎన్నారై డెస్క్: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలు ఈసారి జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో జరగనున్నాయి. తానా 24వ ద్వైవార్షిక మహాసభలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తానా కాన్ఫరెన్స్ నాయకులు కలిసి మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
Also Read: 24వ తానా మహాసభల సర్వ కమిటీ సమావేశం
ఈ సందర్భంగా తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ళ గంగాధర్, మాజీ అధ్యక్షులు, ఎన్నారై టీడీపీ నాయకులు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శ్రీనివాస్ నాదెళ్ళ, గిరి వల్లభనేని, ఎన్నారై గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళతోపాటు ఇతరులు పాల్గొన్నారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..