Viral Video: కప్పే కదా అని తక్కువ అంచనా వేస్తే ఇలాగే అవుతుంది.. ఈ పాము పరిస్థితి చూస్తే..
ABN , Publish Date - Feb 22 , 2025 | 10:04 AM
ఓ పాముకు కప్ప తారసపడుతుంది. దీంతో కప్పపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము దాడి చేయడంతో కప్ప ఒక్కసారిగా అలెర్ట్ అవుతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎదురుదాడి చేస్తుంది. చివరకు ఏం జరిగిందో చూడండి..

కప్ప, పాముకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సాధారణంగా కప్పను చూడగానే పాము దాడి చేయడం సహజం. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు పాము చేతిలో కప్పలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. అయితే ఎప్పుడూ పరిస్థితి ఇలాగే ఉంటుందా.. అంటే కాదనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు పరిస్థితి తారుమారు అవుతుంటుంది. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కప్పే కదా అని తక్కువ అంచనా వేసిన పాము పరిస్థితి చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పాముకు కప్ప తారసపడుతుంది. దీంతో కప్పపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము దాడి చేయడంతో కప్ప ఒక్కసారిగా అలెర్ట్ అవుతుంది. ఏమాత్రం ఆలస్యం (frog attacked snake) చేయకుండా ఎదురుదాడి చేస్తుంది. పాము తోక పట్టుకుని అమాంతం మింగేస్తుంది.
Viral Video: వీళ్లు మనుషులేనా.. రైల్లో చిరు వ్యాపారిని ఎలా మోసం చేస్తున్నారో చూడండి..
ఇలా కప్ప ఊహించని విధంగా దాడి చేయడంతో పాము షాక్ అవుతుంది. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా దాన్ని కప్ప వదలకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఇంతలో ఆ ఇంట్లో నుంచి ఓ పిల్లాడు, కుక్క పిల్ల అక్కడికి వస్తాయి. కుక్క పిల్ల పామును తదేకంగా చూస్తూ కాలితో టచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో పాము దానిపై కాటేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో కప్ప వెనుక నుంచి మింగేయడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇలా ఆ పాము కప్ప దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Tiger And Bull Video: ఎద్దుపై పులి ఊహించని దాడి.. చివరకు జరిగింది చూస్తే.. షాకవ్వాల్సిందే..
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కప్పతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది’’.. అంటూ కొందరు, ‘‘ఈ కప్పు టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 వేలకు పైగా లైక్‌లు, 1.75 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
ఇవి కూడా చదవండి..
Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..