Child Driving SUV: భారీ ట్రాఫిక్‌లో ఎస్‌యూవీ నడిపి స్కూలు పిల్లలు.. వీడియో చూసి షాకైపోతున్న జనాలు
ABN , Publish Date - Mar 15 , 2025 | 03:03 PM
పాఠశాల విద్యార్థులు ఏకంగా ఎస్‌యూవీ వాహనం నడిపిన ఘటన తాలుకు వీడియో నెట్టింట కలకలం రేపుతోంది. థానేలో వెలుగు చూసిన ఈ ఘటనపై జనాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కుర్రకారు ఎస్‌యూవీలతో హైవేలపై స్టంట్స్‌కు దిగిన వీడియో చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాళ్లపై పోలీసులు కేసులు పెట్టి గట్టిగా బుద్ధి చెప్పారు. వాహనాలను కూడా సీజ్ చేశారు. ఈ ఘటనలు వార్తల్లో కూడా ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అయినా జనాల్లో మార్పు రావట్లేదు. ఇది చాలదన్నట్టు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూడా భ్రష్టుపట్టిస్తున్నారు. తమతో పాటు ఇతరు ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Holi stain Removal: హోలీ రంగులు వదలక సతమతం అవుతున్న వారు ఇలా చేస్తే..
మహారాష్ట్రలోని థానెలో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, పట్టుమని పదిహేనేళ్లు కూడా లేని ఆరుగురు పిల్లలు మహీంద్రా ఎస్‌యూవీలో ఏకంగా రహదారులపై చెక్కర్లు కొట్టారు. వారిలో ఒక బాలుడు కారు నడుపుతుండగా మరికొందరు కారులో గోలగోల చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. రహదారిపై ఈ పిల్లలు చేసిన స్టంట్ చూసి ఓ వ్యక్తి షాకైపోయాడు. తన చూస్తున్నది నిజమో కాదో తెలీని పరిస్థితిలో వీడియో రికార్డు చేసి నెట్టింట పెట్టాడు. ప్రతీక్ సింగ్ అనే వ్యక్తి ఈ వీడియోను పంచుకున్నాడు. అసలు ఆ వీడియోను తొలుత అనుప్ కేమ్కకర్ అనే వ్యక్తి షేర్ చేసినట్టు తెలిపాడు. ‘‘డ్రైవింగ్ చేస్తుండగా ఈ వీడియోను నేను రికార్డు చేశాను. కారులో అందరూ స్కూలు పిల్లలే. 8 లేదా 9వ తరగతి చదువుతూ ఉంటారు. వారిని చూడగానే హెచ్చరించాను. అసలు దీనికి కారణం తల్లిదండ్రులే’’ అని కేమ్కర్ పేర్కొన్నాడు.
Harsh Goenka wealth tips: ధనవంతులు కావాలనుందా.. ఈ పారిశ్రామికవేత్త చెప్పిన 6 సూత్రాలను ఫాలో అయితే..
ఇక వీడియో వైరల్ కావడంతో నెట్టింట విమర్శలు వెల్లువెత్తాయి. లక్షల కొద్దీ వ్యూ్స్ వచ్చాయి. అనేక మంది ఆ పిల్లల తల్లిదండ్రుల్ని తిట్టిపోశారు. పిల్లల్ని పెంచేది ఇలాగేనా అని ప్రశ్నించారు. ఈ పర్యవేక్షణ లోపమే పిల్లలు పక్కదారి పట్టేలా చేస్తుందని అన్నారు. మరి కొందరు ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ అప్రమత్తం చేశారు. పిల్లల తల్లిదండ్రులకు కఠిన శిక్షలు వేయాలని అన్నారు. నగరాల్లో ఇదో పెద్ద సమస్యగా మారిందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.