Share News

Overnight Millionaire: తలరాతను మార్చిన పాత పాస్‌బుక్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు ఎలా అయ్యాడంటే..

ABN , Publish Date - Apr 16 , 2025 | 08:04 AM

అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా బికారిగా ఉన్న వారు కాస్తా.. అంతలోనే కోటీశ్వరులుగా మారిపోతుంటారు. తినడానికి ఠికానా లేరు వారు కూడా రాత్రిరాత్రే లక్షాధికారులు అవుతుండడం తరచూ చూస్తుంటాం. కొందరు..

Overnight Millionaire: తలరాతను మార్చిన పాత పాస్‌బుక్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు ఎలా అయ్యాడంటే..

అదృష్టం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా బికారిగా ఉన్న వారు కాస్తా.. అంతలోనే కోటీశ్వరులుగా మారిపోతుంటారు. తినడానికి ఠికానా లేరు వారు కూడా రాత్రిరాత్రే లక్షాధికారులు అవుతుండడం తరచూ చూస్తుంటాం. కొందరు లాటరీ టికెట్‌ల ద్వారా ధనవంతులు అవుతుంటే.. మరికొందరు నిధుల కారణంగా బిగ్‌షాట్ అవడం గురించి వింటుంటాం. అయితే తాజాగా, ఓ వ్యక్తి పాత పాస్‌బుక్‌ వల్ల రాత్రి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన చిలీ (Chile) దేశంలో చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఎక్సెక్వియల్ హినోజోసా అనే వ్యక్తి జీవితంలో ఇటీవల ఊహించని సర్‌ప్రైజ్ చోటు చేసుకుంది. ఇటీవల ఓ రోజు హినోజోసా తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పాత పాస్‌బుక్ (Old bank passbook) కనిపించింది. ఏంటా అని తీసి చూడగా.. ఆ పాస్‌బుక్ 62 ఏళ్ల క్రితం నాటి తన తండ్రికి సంబంధించినదని తెలిసింది.

Metro Funny Video: మెట్రో రైల్లో నిద్రపోతున్న యువకుడు.. సమీపానికి వచ్చిన యువతి.. చివరకు జరిగింది చూస్తే..


1960-70 ల మధ్యలో హినోజోసా తండ్రి బ్యాంకులో రూ.1.4 లక్షలు డిపాజిట్ చేశారు. ఆ డబ్బులతో ఇల్లు కట్టుకోవాలనేది అతడి కోరిక. అయితే ఈ క్రమంలో అతను పదేళ్ల క్రితం మరణించాడు. దీంతో ఈ విషయం ఇంట్లో వారికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. ఆ పాస్‌బుక్‌లో పేర్కొన్న బ్యాంక్ చాలా కాలం క్రితమే మూసేశారు. దీంతో ఆ పాస్‌బుక్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అనకున్నాడు. అయితే అందులో స్టేట్ గ్యారెంటీ అని పేర్కొంటూ.. ఒకవేళ బ్యాంకు వారిది తప్పు ఉంటే ప్రభుత్వం డబ్బులను తిరిగి చెల్లిస్తుంది అని రాసి ఉంది.

Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..


pass-book.jpg

పాస్‌బుక్‌లో ప్రస్తావించిన నిబంధనలను చూడగానే ఆ డబ్బులును ఎలాగైనా తీసుకోవాలనే ఉద్దేశంతో హినోజోసా.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే డబ్బులు తిరిగి ఇచ్చేందుకు ప్రభుత్వం మొదట అంగీకరించలేదు. దీంతో హినజోసా చివరకు కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించిన న్యాయస్థానం ఆ డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం హినోజోసాకు మొత్తం 1.2 మిలియన్ డాలర్లు (రూ. 10,27,79,580) తిరిగి చెల్లించేందుకు ఒప్పుకొంది. ఇలా హినోజోసా తాను అనుకున్నది సాధించి, చివరకు రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. కాగా, ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Jugad Viral Video: సీలింగ్ ఫ్యాన్‌తో ఏసీ ఎఫెక్ట్.. ప్రయోగం చూశారంటే నోరెళ్లబెట్టాల్సిందే..


ఇవి కూడా చదవండి..

Young Women Viral Video: ఫాస్ట్ ఫుడ్ తిని పెరిగితే ఇలాగే ఉంటుంది మరి.. టెంకాయ కొట్టమంటే.. ఏం చేసిందో చూడండి..

Viral Video: నీళ్లే కదా అని ఈత కొడుతున్నారా.. రాయి వేసి చూడగా ఏమైందో చూడండి..

Mosquito Funny Video: ఇంకా ట్రైనింగ్‌లోనే ఉందేమో.. చేతిపై ఈ దోమ నిర్వాకం చూస్తే.. నవ్వకుండా ఉండలేరు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 16 , 2025 | 12:06 PM