Share News

Tiger And Bull Video: ఎద్దుపై పులి ఊహించని దాడి.. చివరకు జరిగింది చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Feb 21 , 2025 | 09:42 PM

పులి దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పులులు పెద్ద పెద్ద జంతువులను సైతం ఎంతో అవలీలగా చంపేస్తుంటాయి. మరికొన్నిసార్లు అతి కష్టం మీద వేటాడినా కూడా చివరకు పైచేయి సాధిస్తుంటాయి. ఇలాంటి..

Tiger And Bull Video: ఎద్దుపై పులి ఊహించని దాడి.. చివరకు జరిగింది చూస్తే.. షాకవ్వాల్సిందే..

పులి దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు పులులు పెద్ద పెద్ద జంతువులను సైతం ఎంతో అవలీలగా చంపేస్తుంటాయి. మరికొన్నిసార్లు అతి కష్టం మీద వేటాడినా కూడా చివరకు పైచేయి సాధిస్తుంటాయి. ఇలాంటి చిత్ర విచిత్ర సంఘనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పులి భయంకర వేటకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పెద్ద పులి ఎద్దుపై ఊహించని విధంగా దాడి చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) పన్నా అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆకలితో ఉన్న ఓ పెద్ద పులి.. అడవికి సమీప ప్రాంతంలోకి చొరబడింది. ఈ క్రమంలో అక్కడే గడ్డి మేస్తున్న ఎద్దును టార్గెట్ చేసింది. చివరకు (Tiger attack on bull) ఊహించని విధంగా ఎద్దుపై దాడి చేసింది.

Woman Funny Video: ఎలాగైనా ఎక్కి తీరాల్సిందే.. ఎక్సలేటర్‌పై ఈమె నిర్వాకం చూస్తే..


పులి ఊహించని దాడితో షాక్ అయిన ఎద్దు.. దాన్నుంచి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయితే పులి ఎద్దును వదలకుండా గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఇలా చివరకు ఎద్దును కిందపడేసి పైచేయి సాధిస్తుంది. చూస్తుండగానే అంత పెద్ద ఎద్దును సైతం ఈడ్చుకుంటూ పొదల్లోకి తీసుకెళ్తుంది. ఈ ఘటనలో పులి దాడిలో ఎద్దు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Viral Video: మామిడి కాయలు కోస్తూ ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయిన బాలుడు.. చివరకు ఏమైందో చూడండి..


కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. పాపం.. ఎద్దును చూస్తుంటే బాధగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘పులి దాడి చూస్తుంటే భయమేస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..


ఇవి కూడా చదవండి..

Bride And Groom Video: ఫొటో తీస్తూ వధువును పదే పదే తాకుతున్న కెమెరామెన్.. వరుడు గమనించడంతో చివరకు..

Viral Video: ఈ కారును ఫోలో చేస్తే గజగజా వణికిపోవాల్సిందే.. సమీపానికి వెళ్లి చూస్తే గుండె ఆగిపోయే సీన్..

Viral Video: పిల్లలకు ఫోన్లు అలవాటు చేస్తున్నారా.. ఈ చిన్నారి పరిస్థితి ఏమైందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Elephant Attack Video: దూసుకొస్తున్న ఏనుగును చూసి రెండస్థుల పైకి ఎక్కేసిన జనం.. చివరకు జరిగింది చూస్తే..

Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..

Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 21 , 2025 | 09:43 PM