Gambhir vs Pant: టీమ్‌లో నుంచి వెళ్లిపో.. పంత్‌కు గంభీర్ వార్నింగ్
ABN , Publish Date - Jan 01 , 2025 | 02:44 PM
Team India: కూల్‌గా ఉండే గంభీర్ సీరియస్ అయ్యాడు. అవసరమైతే తప్ప మాట్లాడని మౌన మునిలా ఉండేటోడు మాటల తూటాలతో స్టార్ బ్యాటర్‌ను టార్గెట్ చేశాడు. దీంతో ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే డ్రెస్సింగ్ రూమ్ ఒక్కసారిగా హీటెక్కింది.
IND vs AUS: కూల్‌గా ఉండే గౌతం గంభీర్ సీరియస్ అయ్యాడు. అవసరమైతే తప్ప మాట్లాడని మౌన మునిలా ఉండేటోడు మాటల తూటాలతో స్టార్ బ్యాటర్‌ను టార్గెట్ చేశాడు. దీంతో ఎప్పుడూ ఆహ్లాదంగా ఉండే డ్రెస్సింగ్ రూమ్ ఒక్కసారిగా హీటెక్కింది. టీమ్‌లో ఉండాలని అనుకుంటున్నారా? లేదా? అంటూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ వరకు సీనియర్లు అందర్నీ హెడ్ కోచ్ ఏకిపారేశాడట. స్పెషల్‌గా పించ్ హిట్టర్ రిషబ్ పంత్‌ను లక్ష్యంగా చేసుకొని గంభీర్ ఫైర్ అయ్యాడట. ఇప్పటికే చాలా ఎక్కువైంది.. టీమ్‌లో నుంచి వెళ్లిపొమ్మంటూ సీరియస్ కామెంట్స్ చేశాడట. అసలు గౌతీ ఇంతలా ఆగ్రహానికి గురవడానికి కారణం ఏంటి? మెన్ ఇన్ బ్లూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమ్‌ను వదిలెయ్!
కోచ్‌గా వచ్చినప్పటి నుంచి టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌ను ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటున్న గంభీర్.. ఒక్కసారిగా పంత్ సహా అందరిపై సీరియస్ అయ్యాడట. న్యూజిలాండ్ సిరీస్‌లో వైట్‌వాష్ అవడం, తాజాగా ఆసీస్ సిరీస్‌లో 1-2తో వెనుకంజలో వేయడం, రోహిత్-కోహ్లీ సహా సీనియర్ ఆటగాళ్ల ఫెయిల్యూర్.. తాను ఎంత అడిగినా ఛటేశ్వర్ పుజారాను సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో అటు బీసీసీఐ మీద ఇటు టీమ్ ప్లేయర్ల మీద కోపంతో ఉన్న గంభీర్.. మొత్తం అగ్రెషన్‌ను డ్రెస్సింగ్ రూమ్‌లో చూపించాడట. ఇలాగే ఆడాలని అనుకుంటే టీమ్‌ను వదిలేసెయ్ అంటూ పంత్‌కు వార్నింగ్ ఇచ్చాడట హెడ్ కోచ్.
రూల్స్ పాటిస్తేనే టీమ్‌లో..!
ప్రతి ప్లేయర్‌కు ఓ స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి ఇన్నాళ్లూ వాళ్లకు నచ్చినట్లు ఆడేందుకు స్వేచ్ఛను ఇచ్చిన గంభీర్.. ఇకపై వాళ్లకు ముకుతాడు వేయాలని ఫిక్స్ అయ్యాడట. అదే విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో స్పష్టం చేశాడట. ఇకపై తాను చెప్పినట్లు ఆడాలని.. టీమ్ అవసరాలకు తగినట్లు గేమ్‌ను మార్చుకోవాలని హెచ్చరించాడట. తమకు నచ్చినట్లే ఆడతామని అనుకునే ప్లేయర్లు టీమ్‌ను వీడాలంటూ వార్నింగ్ ఇచ్చాడని వినిపిస్తోంది. జట్టు గెలుపు కంటే ఏదీ పెద్ద కాదని క్లారిటీ ఇచ్చాడట. కాగా, ప్రస్తుత కంగారూ సిరీస్‌లో కోహ్లీ, రోహిత్, పంత్ సహా పలువురు బ్యాటర్లు అడ్డగోలు షాట్లు బాది ఔట్ అవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో గంభీర్ సీరియస్ అవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.