Share News

Rohit-Gill: గిల్ స్టన్నింగ్ సిక్స్.. షాట్ కంటే రోహిత్ రియాక్షనే హైలైట్

ABN , Publish Date - Feb 20 , 2025 | 08:40 PM

Shubman Gill: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టచ్‌లోకి వచ్చిన గిల్.. దాన్ని చాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.

Rohit-Gill: గిల్ స్టన్నింగ్ సిక్స్.. షాట్ కంటే రోహిత్ రియాక్షనే హైలైట్
Rohit Sharma

చాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లోనే భారత్ చెలరేగి ఆడుతోంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ప్రత్యర్థిని 228 పరుగులకే ఆలౌట్ చేసింది టీమిండియా. ఆ తర్వాత చేజింగ్‌ దిగిన మెన్ ఇన్ బ్లూ.. బ్యాటింగ్‌లోనూ అదరగొడుతోంది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరిస్తున్నారు. అయితే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నాక్ మాత్రం అన్నింటా స్పెషల్ అనే చెప్పాలి. ఇంగ్లండ్‌తో సిరీస్‌తో టచ్‌లోకి వచ్చిన గిల్.. అదే ఫామ్‌ను చాంపియన్స్ ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు. అతడి బ్యాటింగ్‌కు అభిమానులే కాదు.. మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సారథి రోహిత్ శర్మ కూడా ఫిదా అయిపోయాడు.


అలా ఎలా కొట్టావ్ బాస్!

బంగ్లాతో మ్యాచ్‌లో గిల్ కొట్టిన ఓ షాట్‌కు రోహిత్ షాక్ అయ్యాడు. బౌన్సర్‌ను వెంటనే పిక్ చేసిన గిల్.. లెగ్ సైడ్ కళ్లుచెదిరే రీతిలో పుల్ షాట్‌గా మలిచాడు. నిల్చున్న చోటు నుంచే బంతి వేగం, దిశ, బౌన్స్‌ను అంచనా వేసి స్టేడియంలోకి తరలించాడు. బంతి పడటం, గిల్ షాట్ కొట్టడం, అది ప్రేక్షకుల గ్యాలరీల్లోకి వాలిపోవడం రెప్పపాటులో జరిగిపోయాయి. దీంతో నాన్‌స్ట్రయికర్ ఎండ్‌లో ఉన్న హిట్‌మ్యాన్ షాక్ అయ్యాడు. ఇదేం షాట్ అంటూ వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. బాల్‌ అక్కడే పడుతుంది, అలాంటి షాటే కొట్టాలని ముందే డిసైడ్ అయి గిల్ బాదినట్లుగా అనిపించడంతో ఫిదా అయిపోయాడు రోహిత్. భలే కొట్టావంటూ అతడ్ని మెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఇవీ చదవండి:

చరిత్ర తిరగరాసిన రోహిత్

షమి తుఫాను.. 4 రికార్డులు బ్రేక్

అల్లు అర్జున్‌ను దించేసిన బంగ్లాదేశ్ బ్యాటర్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 20 , 2025 | 08:40 PM