Share News

Virat Kohli: రంజీల్లోకి కోహ్లీ.. ట్రిపుల్ సెంచరీ కొట్టినా దండగే.. కానీ అది జరిగితే మాత్రం...

ABN , Publish Date - Jan 29 , 2025 | 07:37 PM

Virat Kohli Ranji Entry: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీ ఎంట్రీ అంతా రెడీ అయిపోయింది. ఇక కింగ్ గర్జిస్తూ బరిలోకి దూకడమే తరువాయి. కానీ ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. కాస్త తేడా జరిగినా దబిడిదిబిడి అయ్యేలా ఉంది.

Virat Kohli: రంజీల్లోకి కోహ్లీ.. ట్రిపుల్ సెంచరీ కొట్టినా దండగే.. కానీ అది జరిగితే మాత్రం...
Virat Kohli

Delhi vs Railways: విరాట్ కోహ్లీ కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. క్రికెట్‌లో దిగ్గజ స్థాయిని అతడు ఆల్రెడీ అందుకున్నాడు. అయితే గేమ్‌లో కొనసాగినన్ని రోజులు అదే లెవల్‌లో ఉంటే అదిరిపోతుంది. అందుకే బ్యాడ్ ఫామ్‌తో బాధపడుతున్న కింగ్.. తిరిగి టచ్‌లోకి వచ్చేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాడు. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో గంటల తరబడి సిమెంట్ పిచ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో రంజీ ట్రోఫీ రీఎంట్రీ అదిరిపోవడం ఖాయమని.. దేశవాళీ మ్యాచ్‌లో అతడు సెంచరీల మోత మోగించడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే సెంచరీల మాట దేవుడెరుగు.. అది జరిగితే మాత్రం ఖేల్ ఖతం దుకాణం బంద్ అనే కామెంట్స్ వస్తున్నాయి.


ట్రోలింగ్ తప్పదు!

2012, నవంబర్.. కోహ్లీ చివరగా ఆడిన రంజీ మ్యాచ్ తేదీ అది. విరాట్ దేశవాళీ మ్యాచ్‌లు ఆడి దాదాపు 13 ఏళ్లు కావొస్తోంది. అప్పట్లో 24 ఏళ్ల యంగ్‌స్టర్ అతడు. ఇప్పుడు 36 ఏళ్ల ఫుల్ ఎక్స్‌పీరియెన్స్ బ్యాటర్. 123 టెస్టులు, 30 సెంచరీలు చేసిన తోపు ప్లేయర్. అయితే గత 5 ఏళ్లలో కేవలం 3 సెంచరీలు బాదడం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్ అవడంతో అతడు రంజీల బాట పట్టాడు. గురువారం రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆడనున్నాడు కింగ్. అయితే టన్నుల కొద్దీ పరుగులు బాదిన విరాట్.. ఈ టెస్ట్‌లో సెంచరీ, డబుల్ సెంచరీ లేదా ట్రిపుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ అతడు విఫలమైతే మాత్రం విమర్శలు తప్పేలా లేవు.


ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

కోహ్లీకి అపోజిషన్ టీమ్ అయిన రైల్వేస్‌ చాలా బలహీనంగా కనిపిస్తోంది. కర్ణ్ శర్మ తప్ప ఆ జట్టు బౌలింగ్ లైనప్ వీక్‌గా ఉంది. దీంతో ఆ జట్టుపై కోహ్లీ అలవోకగా భారీ ఇన్నింగ్స్ ఆడతాడని అంతా అనుకుంటున్నారు. అయితే ఆస్ట్రేలియాపై ఆడిన మాదిరికిగా తక్కువ స్కోర్లకే వెనుదిరిగితే మాత్రం విమర్శలు తప్పవని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. రైల్వేస్ లాంటి జట్టు మీద పరుగులు చేయకపోతే ఇంకా ఎవరితో ఆడితే పరుగులు బాదుతావంటూ అతడిపై విమర్శలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో క్రీజులో నిలబడటం, నిదానంగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లడం, టచ్‌లోకి వచ్చాక భారీ షాట్లు బాదడం, బిగ్ ఇన్నింగ్స్‌గా మలచడంపై అతడు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. ఫామ్ అందుకొని విమర్శలకు చెక్ పెడతాడో? తక్కువ స్కోరుకే ఔటై కొత్త కాంట్రవర్సీకి ద్వారాలు తెలుస్తాడో అంతా విరాట్ చేతుల్లోనే ఉంది.


ఇవీ చదవండి:

సచిన్‌తో సమానంగా స్టీవ్ స్మిత్.. చూస్తుండగానే రేంజ్ మారిపోయింది

ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో తిలక్.. ఆజామూ నీకు మూడింది

పరువు కాపాడిన తిలక్-వరుణ్.. సీనియర్లను నమ్ముకుంటే అంతే సంగతులు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 10:22 PM