సన్నీ.. ఎంత మంచి మనసో!
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:58 AM
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సునీల్ గవాస్కర్ చాంప్స్ ఫౌండేషన్ బాసటగా నిలిచింది. ఈ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా కాంబ్లీకి రూ.30 వేల ఆర్థిక సాయం, వైద్య ఖర్చుల నిమిత్తం ఏటా మరో రూ.30 వేలు...

కాంబ్లీకి నెలకు రూ. 30వేల ఆర్థిక సాయం
ముంబై: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సునీల్ గవాస్కర్ చాంప్స్ ఫౌండేషన్ బాసటగా నిలిచింది. ఈ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా కాంబ్లీకి రూ.30 వేల ఆర్థిక సాయం, వైద్య ఖర్చుల నిమిత్తం ఏటా మరో రూ.30 వేలు ఇవ్వనున్నట్టు ఫౌండేషన్ తెలిపింది. మాజీ క్రీడాకారులకు సాయం చేసేందుకు ఈ స్వచ్ఛంద సంస్థను 1999లో గవాస్కర్ స్థాపించాడు. గత జనవరిలో జరిగిన వాంఖడే స్టేడియం 50వ వార్షికోత్సవం సందర్భంగా గవాస్కర్‌ను కాంబ్లీ కలిశాడు. అప్పుడు కాంబ్లీకి సాయం చేస్తానని ఇచ్చిన మాటను గవాస్కర్ నెరవేర్చాడు. ఇక, గత డిసెంబరులో మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో కాంబ్లీ రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకొని, కోలుకోవడం తెలిసిందే.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..