Rohit Sharma: రోహిత్ శర్మను పక్కన పెట్టెశారా..నెక్ట్స్ మ్యాచ్‌లకు డౌటే
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:17 PM
వరుస వైఫల్యాల కారణంగా రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ పక్కనపెట్టిందా.. గాయం కారణంగా విశ్రాంతి ఇచ్చిందా.. తరువాతి మ్యాచ్‌లలో రోహిత్ ఆడతాడా లేదా

హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఎన్నో ఐపీఎల్ మ్యాచ్‌లను గెలిపించిన రికార్డు ఉంది. కొన్ని మ్యాచ్‌లలో విఫలమైనా జట్టులో అతడి స్థానం సుస్థిరం. ముంబై అంటే ప్లేయింగ్ 11లో రోహిత్ పేరుండాల్సిందే. కానీ శుక్రవార (ఏప్రిల్ 4) లక్నోతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ కనిపించలేదు. దీంతో రోహిత్ శర్మను పక్కన పెట్టెశారా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా రోహిత్ మ్యాచ్ ఆడటంలేదనే వార్త అతడి ఫ్యాన్స్‌లో నిరాశ తెప్పించింది.
ఏప్రిల్4న జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ సందర్భంగా మాట్లాడుతూ గాయం కారణంగా రోహిత్ మ్యాచ్ ఆడటం లేదని చెప్పారు. అయినప్పటికీ వరుస వైఫల్యాల కారణంగా రోహిత్‌ను పక్కన పెట్టెశారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. తరువాతి కొన్ని మ్యాచ్‌లకు రోహిత్ శర్మ దూరంగా ఉంటారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. దీంతో రోహిత్‌ను పక్కన పెట్టెశారా.. గాయం కారణంగా విశ్రాంతి ఇచ్చారా.. బెంగళూరుతో ఏప్రిల్ 7వ తేదీన జరిగే మ్యాచ్‌లో ఆడతాడా లేదో తెలుసుకుందాం.
గాయం నిజమే
లక్నోతో మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ మోకాలిపై గాయం కారణంగా అతడు మ్యాచ్ ఆడటం లేదని ప్రకటించాడు . మ్యాచ్ ప్రారంభానికి ముందు వైరల్ అయిన వీడియోలో రోహిత్ శర్మకు ప్రాక్టీస్ సమయంలో మోకాలిపై బంతి తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత అతడు బ్యాట్ సపోర్ట్‌తో మెట్లు ఎక్కుతూ కనిపించాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. హిట్ మ్యాన్ కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతారని ఊహించారు. మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్దనే రోహిత్ గాయం గురించి మాట్లాడారు. మోకాలి దగ్గర గాయమైందని, బ్యాటింగ్‌కు ప్రయత్నించినప్పటికీ ప్రాక్టీస్‌లో పాల్గొనలేకపోయాడని చెప్పారు. ఏప్రిల్ 4వ తేదీ ఫిట్‌నెస్ టెస్ట్‌లో కూడా రోహిత్ అసౌకర్యంగా కనిపించాడని, దీంతో కొన్ని రోజులు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించామన్నారు. దీంతో రోహిత్ గాయం నిజమని తేలింది. ప్రాక్టీస్ సమయంలో హిట్ మ్యాన్ గాయపడినట్లు తెలుస్తోంది.
వైఫల్యాల కారణంగా అంటూ
ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొందింది. మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. వీటిలో ఒక మ్యాచ్ రోహిత్ ఆడలేదు. రోహిత్ మూడు మ్యాచ్‌లు ఆడగా ముంబై ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఈ మూడు మ్యాచ్‌లలో రోహిత్ 0, 8, 13పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వైఫల్యాల కారణంగా మూడో మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చారని, నాలుగో మ్యాచ్‌లో తప్పించారనే ప్రచారం జరుగుతోంది. అయితే కెప్టెన్, కోచ్ మాత్రం గాయం కారణంగానే రోహిత్ మ్యాచ్‌కు దూరమయ్యాడని స్పష్టం చేశారు. మరోవైపు మ్యాచ్ రోజున రోహిత్ శర్మ గ్రౌండ్‌లో ఉన్నారు. సూర్య కుమార్ యాదవ్‌తో మాట్లాడుతూ కనిపించాడు. స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ సమయంలో డకౌట్ నుంచి బయటకు వచ్చాడు. దీంతో రోహిత్ శర్మ జట్టుతో సన్నిహితంగా ఉన్నాడనే సంకేతాలను ఇస్తోంది. ఇవ్వన్నీ చూస్తే రోహిత్ గాయం కారణంగా ఆడలేదనే విషయం స్పష్టమవుతోంది.
నెక్ట్స్ మ్యాచ్ ఆడతాడా
ముంబై ఇండియన్స్ తన వరుస మ్యాచ్‌లను ఏప్రిల్ 7న బెంగళూరుతో, 10న చెన్నైతో ఆడనుంది. కోచ్ జయవర్దనే కొన్ని రోజులు రోహిత్‌కు విశ్రాంతి ఇస్తామని చెప్పారు. గాయం తీవ్రమైనది కాకపోయినా ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని 7వ తేదీ మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
Axis Power Deal: జగన్ బాటలోనే చంద్రబాబు
YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ
Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here