Share News

India vs England: ఇంగ్లండ్‌తో మూడో టీ-20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..

ABN , Publish Date - Jan 28 , 2025 | 06:59 PM

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లలో భాగంగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌నకు విశ్రాంతిని ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు కల్పించింది.

India vs England: ఇంగ్లండ్‌తో మూడో టీ-20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా..
India vs England 3rd T20I

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లలో భాగంగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌నకు విశ్రాంతిని ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు కల్పించింది. కాగా, రాజ్‌కోట్‌లో వాతావరణం అనుకూలంగా ఉంది. రాజ్‌కోట్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరిస్తుంది. స్పిన్నర్లకు కాస్త సహకారం లభించినప్పటికీ పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాలి (India vs England).


ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జాస్ బట్లర్ తప్ప మిగతా ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నారు. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోలేకపోతున్నారు. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా రాజ్‌కోట్‌లోనే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కృత నిశ్ఛయంతో ఉంది. అభిషేక్ శర్మ సూపర్ బ్యాటింగ్‌తో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన టీమిండియా, రెండో మ్యాచ్‌తో తిలక్ వర్మ అద్భుత పోరాటంతో గెలుపు తీరాలకు చేరింది. ప్రస్తుతం రాజ్‌కోట్ మ్యాచ్‌లో కూడా గెలిచి మరో రెండు టీ20లు మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. మరి, విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.


తుది జట్లు:

భారత్: సంజు శాంసన్ (కీపర్), సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ధ్రువ్ జురెల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి

ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టన్, జేమీ స్మిత్ (కీపర్), జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 28 , 2025 | 07:05 PM