Share News

IPL 2025, RCB vs GT: స్వంత మైదానంలో హ్యాట్రిక్ కొడతారా.. గుజరాత్‌ను ఛాలెంజ్ చేస్తారా

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:58 PM

ఈ సీజన్‌లో బెంగళూరు వాసులకు మాత్రం ఐపీఎల్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించే అవకాశం రాలేదు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఈ రోజు సొంత గడ్డపై మ్యాచ్ ఆడబోతోంది.

IPL 2025, RCB vs GT: స్వంత మైదానంలో హ్యాట్రిక్ కొడతారా.. గుజరాత్‌ను ఛాలెంజ్ చేస్తారా
RCB vs GT

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కాస్త ఆలస్యంగా ఐపీఎల్ (IPL 2025) సంబరాలు మొదలవుతున్నాయి. తాజా సీజన్‌లో ఇప్పటికి పదికి పైగా ఐపీఎల్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే ఇప్పటివరకు ఈ సీజన్‌లో బెంగళూరు వాసులకు మాత్రం ఐపీఎల్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించే అవకాశం రాలేదు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. ఈ రోజు సొంత గడ్డపై మ్యాచ్ ఆడబోతోంది (RCB vs GT).


బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఆర్సీబీ తలపడబోతోంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైజర్స్ టీమ్‌లను ఓడించి జోరుమీదుంది. ఈ రోజు మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో కూడా గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని ఊవిళ్లూరుతోంది. ఆయా జట్ల సొంత మైదానాల్లోనే ఆ జట్లను ఓడించింది. మరి, తాజాగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌ను బెంగళూరు ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.


ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో ఐదు సార్లు తలపడ్డాయి. వాటిల్లో ఆర్సీబీ మూడు సార్లు, గుజరాత్ రెండు సార్లు విజయాలు సాధించాయి. చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు జట్లు గతంలో రెండుసార్లు తలపడ్డాయి. ఒక్కో విజయంతో నిలిచాయి. ఇక, ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ బెంగళూరులో 91 మ్యాచ్‌లు ఆడింది. వాటిల్లో 43 విజయాలు, 43 ఓటములు చవిచూసింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ గ్రౌండ్‌లో ఆర్సీబీ సాధించిన అత్యధిక స్కోరు 263 పరుగులు. ఈ మైదానంలో విరాట్ కోహ్లీ నాలుగు ఐపీఎల్ సెంచరీలు సాధించాడు. 22 హాఫ్ సెంచరీలు కొట్టాడు.

ఇవి కూడా చదవండి..

Rohit Sharma: నాతో పాటు ఆడిన వారు ఇప్పుడు కోచ్‌లుగా ఉన్నారు.. నేనేం చేయాలో నాకు తెలుసు: రోహిత్ శర్మ


Riyan Parag: రియాన్ పరాగ్‌కు అంత పొగరా.. అతడిపై నిషేధం విధించాలంటూ నెటిజన్ల కామెంట్లు


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2025 | 04:58 PM