IPL 2025: తీరు మార్చుకోని దిగ్వేష్.. బీసీసీఐ భారీ జరిమానా.. పంత్‌కు కూడా ఫైన్
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:51 PM
శుక్రవారం లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను పంత్ సారథ్యంలో లఖ్‌నవూ చిత్తు చేసింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్, ఆటగాడు దిగ్వేష్ సింగ్‌లకు బీసీసీఐ భారీ జరిమానా విధించింది.

శుక్రవారం ముంబై ఇండియన్స్ (MI vs LSG)తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant), ఆటగాడు దిగ్వేష్ సింగ్‌లకు (Digvesh Singh) బీసీసీఐ (BCCI) భారీ జరిమానా (Fine) విధించింది. శుక్రవారం లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను పంత్ సారథ్యంలో లఖ్‌నవూ చిత్తు చేసింది.
ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ జరిమానాను ఎదుర్కొన్నట్టు బీసీసీఐ వెల్లడించింది. ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్‌కు బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ ఎదుర్కొన్న మూడో ఆటగాడు పంత్. పంత్ కంటే ముందు ఈ సీజన్‌లో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా జరిమానాలను ఎదుర్కొన్నారు. మరోసారి పంత్ ఇదే తప్పిదం చేస్తే ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
ఇక, తన తీరు మార్చుకోని లఖ్‌నవూ బౌలర్ దిగ్వేష్ సింగ్‌పై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. ఈ మ్యాచ్‌లో నమన్ ధీర్‌ను అవుట్ చేసిన తర్వాత దిగ్వేష్ సంతకం పెడుతున్నట్టుగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ తీరుపై మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు మేరకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 2.5 కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 ప్రకారం దిగ్వేష్ మ్యాచ్ ఫీజ్‌లో 50 శాతం జరిమానా విధించింది. ఇంతకు ముందు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా దిగ్వేష్ ఇలాగే వ్యవహరించాడు. అప్పుడు బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజ్‌లో 25 శాతం జరిమానా విధించింది. అయినా తీరు మార్చుకోకపోవడంతో తాజాగా 50 శాతం జరిమానా విధించింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..