Share News

విడాకుల బాటలో మేరీ కోమ్‌!

ABN , Publish Date - Apr 09 , 2025 | 03:43 AM

భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ తమ 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకనున్నట్టు సమాచారం. భర్త కరుంగ్‌ ఓంకోలెర్‌తో తను విడిపోయేందుకు సిద్ధమైనట్టు ఆమె సన్నిహిత వర్గాలు...

విడాకుల బాటలో మేరీ కోమ్‌!

వ్యాపార భాగస్వామితో డేటింగ్‌?

న్యూఢిల్లీ: భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ తమ 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకనున్నట్టు సమాచారం. భర్త కరుంగ్‌ ఓంకోలెర్‌తో తను విడిపోయేందుకు సిద్ధమైనట్టు ఆమె సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇంకా విడాకుల కోసం దరఖాస్తు చేసుకోకపోయినా, ఇద్దరూ విడిగానే జీవిస్తున్నారు. కరుంగ్‌ 2022 మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ప్రచారం కోసం రూ. 2-3 కోట్ల వరకు ఖర్చు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో కాపురంలో కలతలు ఏర్పడడంతో తమ నలుగురు పిల్లలతో మేరీ ఫరీదాబాద్‌కు మకాం మార్చింది. కరుంగ్‌ మాత్రం ఢిల్లీలోనే ఉంటున్నాడు.

ఓ బాక్సర్‌ భర్తతో..: ఓ మహిళా బాక్సర్‌ భర్తను వ్యాపార భాగస్వామిగా పేర్కొంటూ మేరీ కోమ్‌ ఇన్‌స్టా ఖాతాలో పలు ఫొటోలు, వీడియోలు పోస్టుచేసింది. ఆ వ్యక్తి..మేరీకోమ్‌ బాక్సింగ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. మేరీ అతనితో కలిసి మహాకుంభ్‌కు కూడా వెళ్లి ఉత్సవాల్లో పాల్గొంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 09 , 2025 | 03:43 AM