Fleming on Dhoni Retirement: ధోనీ రిటైర్ అవుతాడా.. సీఎస్‌కే కోచ్ ఏమన్నాడంటే..
ABN , Publish Date - Apr 05 , 2025 | 10:29 PM
ధోనీ రిటైర్ కావట్లేదని సీఎస్‌కే కోచ్ స్పష్టం చేశాడు. తద్వారా ధోనీ రిటైర్‌మెంట్‌పై నేడు చెలరేగిన చర్చకు చెక్ పెట్టాడు.

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు ధోనీ తల్లిదండ్రులు హాజరవడంతో జనాల్లో ఒక్కసారిగా మాహీ రిటైర్మెంట్‌పై చర్చ మొదలైంది. 2008 నుంచీ సీఎస్‌కే తరుపున ధోనీ ఆడుతున్నా అతడి తల్లిదండ్రులు మాత్రం మ్యాచ్ చూసేందుకు స్టేడియంకు రావడం ఇదే తొలిసారి. ధోనీ తల్లిదండ్రులతో పాటు అతడి భార్య సాక్షి, కూతురు జివా కూడా వచ్చారు. భార్యాకూతురు రావడం అభిమానులకు కొత్త కాకపోయినా ధోనీ తల్లిదండ్రులను చూసేసరికి అనేక మంది ఆశ్చర్యపోయారు. ధోనీ ఈసారి రిటైర్ అవడం పక్కా అని తీర్మానించుకున్నారు.
ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ పతాకస్థాయికి చేరడంతో సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. ధోనీ రిటైర్ కావట్లేదని స్పష్టం చేశాడు. ‘ఇప్పటికీ ధోనీ అద్భుతంగా ఆడుతున్నాడు. అసలు మేము ధోనీ భవిష్యత్తు గురించి మాట్లాడటమే మానేశాము’’ అని పేర్కొన్నాడు.
గత ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్‌ప్రొటెక్టెడ్ మోచేయికి బంతి తగిలి గాయమైన విషయం తెలిసిందే. రుతురాజ్ కోలుకోకపోతే కెప్టెన్సీ బాధ్యతలు ధోనీకి దక్కుతాయన్న వార్తలు మొదలయ్యాయి. అయితే, అలాంటిదేమీ లేదని రుతురాజ్ క్లారిటీ ఇచ్చాడు. తన చేయి బాగానే ఉందని అన్నాడు.
ఇక నేడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓటముల పరంపర కొనసాగింది. చెన్నైలో స్వంత స్టేడియం కూడా తన రాతను మార్చలేకపోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన సీఎస్‌కే తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఓటమి పాలై హ్యాట్రిక్ అపజయాలను మూటగట్టుకుంది.
చెన్నైపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసిందిద. ఆ తరువాత బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి కేవలం 158 పరుగులే చేయగలిగింది. దాదాపు 15 ఏళ్ల తరువాత ఢిల్లీ చెపాక్ స్టేడియంలో విజయాన్ని అందుకుంది.
ఇవి కూడా చదవండి:
దేవర ఉండగా ఎందుకు టెన్షన్.. శార్దూల్‌పై రోహిత్ కామెంట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి