Javelin Throw Event: మే 24న స్వదేశంలో నీరజ్ చోప్రా టోర్నీ
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:22 AM
స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, మే 24న హరియాణాలోని పంచకులలో జరిగే నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో పోటీపడనున్నాడు. ఈ ఈవెంట్ ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం గోల్డ్ కేటగిరీగా గుర్తించిన సంగతి తెలిసిందే

న్యూఢిల్లీ: స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వచ్చే నెలలో స్వదేశీ అభిమానులను అలరించనున్నాడు. మే 24న హరియాణాలోని పంచకులలో అతడి పేరిటే జరిగే నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో పోటీపడనున్నాడు. అటు ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం కూడా ఈ ఎన్‌సీ క్లాసిక్‌ను గోల్డ్ కేటగిరీగా పేర్కొంది. దీంతో నీరజ్ ఈవెంట్‌ను సెప్టెంబరులో జరిగే వరల్డ్ చాంపియన్‌షిప్‌నకు అర్హత టోర్నీగా భావిస్తున్నారు. ఈ టోర్నీలో నీరజ్‌తో పాటు ఇతర ప్రపంచ జావెలిన్ త్రోయర్లు కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
ప్లేయింగ్ 11తోనే బిగిస్తున్నారు
రహానె బ్యాగ్‌ను తన్నిన జైస్వాల్
ఎస్‌ఆర్‌హెచ్‌పై ఇంత ద్వేషం అవసరమా
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి