ముగిసిన అంగన్‌వాడీల మహాధర్నా...
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:20 PM
అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్-హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆద్వర్యంలో 48 గంటల మహాధర్నా మంగళవారం ముగిసింది.

రాత్రంతా శిబిరంలోనే... వంటావార్పు
సమస్యలపై వినతి పత్రం అందజేత
నస్పూర్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్-హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ ఆద్వర్యంలో 48 గంటల మహాధర్నా మంగళవారం ముగిసింది. రాత్రంతా శిబిరంలోనే బతుకమ్మ, తెలంగాణ దూంధాం ఆటపాటలతో నృత్యాలు చేశారు. మంగళవారం మధ్యాహ్నం వంటావార్పుతో నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వాలు పరిష్కరించాలని కార్యాలయంలో అధికారి సంతోష్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్స్-హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి భానుమతి, రాజమణి మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదిన వేతనాలు చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయవద్దన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలో పెర్కొన్న ప్రకారం రూ. 26వేల వేతనం చెల్లించాలని డిమాం డ్ చేశారు. ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకం, మోబైల్ అంగన్‌వాడీ సెంటర్లను రద్దు చేయాలని, టీచర్స్, హెల్పర్స్‌లకు గ్రాట్యుటీ వర్తింపు పర్మినెంట్ చేయాలన్నారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్, జిల్లా ఉపాధ్యాక్షులు ప్రకాష్, అంగన్‌వాడీ జిల్లా కమిటీ సభ్యులు పద్మా, విరోనిక, సంధ్యా, విక్టోరియా, పద్మ, సబితా, ప్రవీణ, అనురాధా, మహేశ్వరి పాల్గొన్నారు.