భానుడి భగభగ
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:22 PM
సూర్య ప్రతాపం కారణంగా ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండలు రోజు రోజుకూ మండిపోతుండడంతో ఉక్కి రిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెల లోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో ఇళ్ల నుంచి బయ టకు రావాలంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

41డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
మధ్యాహ్నం సమయంలో మరింతగా ఎండ ప్రభావం
ఉదయం పది గంటల నుంచే ఉక్కపోతలు
సింగరేణి కార్మికులకు తప్పని తిప్పలు
ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్న జనం
మంచిర్యాల, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సూర్య ప్రతాపం కారణంగా ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండలు రోజు రోజుకూ మండిపోతుండడంతో ఉక్కి రిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెల లోనే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో ఇళ్ల నుంచి బయ టకు రావాలంటేనే ప్రజలు జంకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా మేలో అధిక ఉష్ణోగ్ర తలు నమోదు అవుతాయి. అందుకు భిన్నంగా మా ర్చిలోనే 41 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మేలో ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి చేరుకుంటాయనే భయాందోళనలు వ్యక్తమవుతు న్నా యి. వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణశాఖ జిల్లాకు ఆరేంజ్ అలర్ట్ ప్రకటిం చిం ది. ప్రజలు ఉదయం 11గంటల నుంచి సాయం త్రం 5 దాటే వరకు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎండ ప్రభావంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లా కేం ద్రంలో నిత్యం రద్దీగా ఉండే మంచిర్యాల-లక్షెట్టిపేట జాతీయ రహదారి, లక్ష్మీటాకీస్, బైపాస్ రోడ్డు, ఫ్లైఓవ ర్ నుంచి శ్రీరాంపూర్ వెళ్లే రహదారులు బోసిపోతు న్నాయి. రాత్రి 7గంటల తరువాత ఉదయం 9గంట లకు ముందే ప్రజలు పనులు చేసుకుంటున్నారు.
తగ్గుముఖం పడుతున్న భూగర్భ జలాలు...
ఎండలు తీవ్రతరం కావడంతో భూగర్భజలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ కారణంగా గోదావ రి నదిలో పూర్తిగా నీరు అడుగంటి పోగా బోర్లలో సైతం ఆలస్యంగా నీరు వస్తున్నట్లు ప్రజలు చెబుతు న్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుల సముదాయం కారణంగా గోదావరి నిత్యం నిండుగాఉండి భూగర్బ జలాలకు డోకా ఉండేది కాదు. గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉండి బోర్లలో సమృద్ధిగా నీరు లభిం చేది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంతో రెండేళ్లుగా గో దావరిలో నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో నది ఎండిపోవడమే కాక దాని ప్రభావం నది పరివాహక ప్రాంతాల్లోని బోర్లపైన పడుతోంది. ఈ కారణంగా వ్యవసాయంపైన ప్రభావం చూపుతోంది. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో సుమారు 3వేల ఎకరాలకు యాసంగికి నిర్మల్ జిల్లాలోని కడెం ప్రా జెక్టు కాలువల ద్వారా నీరు అందుతోంది. మిగితా ప్రాంతాల్లో రైతులు బోర్లపైనే ఆధారపడి సాగు చేస్తారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల రైతులు నదిలో మోటార్లు ఏర్పాటు చేసుకొని పంట లు సాగు చేస్తారు. ప్రస్తుతం నది ఎండి పోవడంతో ఆ ప్రభావం యాసంగి సాగుపైన చూపుతోంది. నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోయే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు.
సింగరేణి కార్మికులకు తప్పని ఇబ్బందులు...
జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి ఏరియాలలోని ఓపెన్‌కాస్టు, అండర్ గ్రౌం డ్ మైన్‌లలో విధులు నిర్వహించే కార్మికులు పెరిగిన ఎండల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ము ఖ్యంగా మిడిల్ షిఫ్ట్, ఉదయం షిఫ్ట్‌ల్లో విధులు ని ర్వహించే కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయం షిఫ్ట్ వెళ్లే కార్మికులు 2గంటలకు విధులు ముగించుకొని ఇంటికి రావాల్సి ఉండగా, మిడిల్ షిఫ్ట్ వెళ్లేవారు మధ్యాహ్నం ఒంటి గంటకు బయలు దేరా ల్సి ఉంటుంది. ఈ క్రమంలో విధులకు హాజరయ్యే వారు, విధుల నుంచి తిరిగి వచ్చే వారు ఎండ తీవ్ర తకు గురవుతున్నారు. ఇప్పటికిప్పుడు గనుల్లో హాజ రుశాతం తగ్గకపోయినా రాబోయే రోజుల్లో ఎండలు తీవ్రతరం కానుండగా... హాజరుశాతంపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎండల వేడిమి కారణంగా విధులు నిర్వహించేందుకు కార్మికులు ఆ సక్తి చూపే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. కార్మికుల అవస్థలు దృష్టిలో పెట్టుకొని సింగరేణి ఉ న్నతాధికారులు షిఫ్ట్‌ల వేళల్లో మార్పులు చేపట్టాలని కార్మికులు కోరుతున్నారు.
విద్యార్థులకూ ఇబ్బందులు...
కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైతం ఎండల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇం టర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నందున మధ్యా హ్నం ఇంటికి వెళ్లే క్రమంలో ఎండ నుంచి ఇబ్బం దులు తప్పడం లేదు. అలాగే పాఠశాలలకు ఒంటి పూట ప్రకటించినప్పటికీ మధ్యాహ్నం సమయంలో ఎండ వేడికి గురవుతున్నారు. అలాగే ఇండ్లలోను ఉ క్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యా న్లు, కూలర్లలో వేడి గాలులు వస్తుండడంతో అవస్థ లు తప్పడం లేదు. ఇప్పటి నుంచే ఏసీలకు పని చె ప్పాల్సిన అవసరం వచ్చింది. కూరగాయలు, ఇతర చి రువ్యాపారులు ఎండవేడిమి భరించలేకపోతున్నారు. రోడ్లపక్కన గొడుగులు ఏర్పాటు చేస్తూ తాత్కాలిక ఉ పశమనం పొందుతున్నారు. విపరీతమైన వేడిమి కా రణంగా అధికదాహం వేస్తుండడంతో ప్రజలు తాగు నీటి కోసం తహతహలాడుతున్నారు.
వారం రోజుల్లో జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా...
గడిచిన వారం రోజుల్లో జిల్లాలో నమోదైన ఉ ష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 12న నెన్నెల మండలంలో 40.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా 13న కాసిపేట మండలం కొండా పూర్‌లో 40.7 డిగ్రీలు, 15న జిల్లా కేంద్రంలో 40.2 డిగ్రీలు, 16న భీమారం మండలంలో 41.0 డిగ్రీలు, 17న చెన్నూర్ మండలం కొమ్మెరలో 41.3డిగ్రీలు, 18న బెల్లంపల్లిలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.