Dr. K. Lakshman: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యం
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:22 AM
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈమేరకు ఇందుకు తగ్గట్టుగా ప్రతిఒక్క కార్యకర్త పనిచేయాలని సూచాంచారు.

- కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ కార్యక్తలకు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్(Dr. K. Lakshman) పిలుపునిచ్చారు. భోలక్‌పూర్ డివిజన్ మహాత్మానగర్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కో-ఆర్డినేటర్ బిజ్జి కనకేష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పార్టీ జెండాను లక్ష్మణ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు పక్కా గృహాలు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాటను విస్మరించారని ఆరోపించారు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: వేసవి సెలవుల్లో 52 వీక్లీ స్పెషల్ రైళ్లు
అదే బాటలో సీఎం రేవంత్‌రెడ్డి సైతం వ్యవహరిస్తున్నారని అన్నారు. భూములను అమ్ముతున్నారని ఆరోపించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతీ పోలింగ్ బూత్‌లో నిర్వహిస్తూ, బీజేపీ సిద్ధాంతాలు, ఆశయాలు ప్రజలకు వివరిస్తూ పార్టీని వారికి మరింత చేరువ చేయాలన్నారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ విశ్వం, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు రాజశేఖర్, మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, నియోజకవర్గం కన్వీనర్ రమేష్‌రాం తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్‌లో..
ముషీరాబాద్‌లో బీజేవైఎం అధికార ప్రతినిధి బుర్రా రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా నవీన్ గౌడ్ పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి వారు మాట్లాడారు. డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ప్రతీ బూత్‌లో బీజేపీ జెండా ఆవిష్కరించాలి
రాంనగర్: ప్రతీ బూత్‌లో బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం బాగ్‌లింగంపల్లిలో రాంనగర్ కార్పొరేటర్ కె.రవిచారి ఆధ్వర్యంలో జరిగిన వేడులకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు.
రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కుట్రదారులకు కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. నగరంలో ఐఎ్‌సఐ తీవ్రవాదుల ఆనవాళ్లు లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాంనగర్ కార్పొరేటర్ కె.రవిచారి మాట్లాడుతూ.. డివిజన్‌లోని అన్ని బస్తీలు, కాలనీలలో పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు జి. భరత్‌కుమార్, ముషీరాబాద్ నియోజకవర్గం కన్వీనర్ రమేష్ రాం, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు గడ్డం సతీష్, నాయకులు గడ్డం నవీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News