BJP: సికింద్రాబాద్‌లో బీజేపీ శ్రేణుల సంబురాలు..
ABN , Publish Date - Feb 21 , 2025 | 11:12 AM
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా(Delhi Chief Minister Rekha Gupta) ప్రమాణ స్వీకారం చేయడంతో గురువారం లష్కర్‌లో బీజేపీ నేతలు సంబురాలు జరుపుకొన్నారు.

- రేఖాగుప్తా ఢిల్లీ సీఎం కావడంపై పార్టీ మహిళా నేతల హర్షం
సికింద్రాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా(Delhi Chief Minister Rekha Gupta) ప్రమాణ స్వీకారం చేయడంతో గురువారం లష్కర్‌లో బీజేపీ నేతలు సంబురాలు జరుపుకొన్నారు. సికింద్రాబాద్, సనత్‌నగర్, కంటోన్మెంట్(Secunderabad, Sanathnagar, Cantonment) నియోజకవర్గాల్లో టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆనందోత్సవాలు వ్యక్తం చేశారు. పార్టీలోని మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది అనడానికి ఇదే తార్కాణమని నినాదాలు చేశారు. పార్టీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రిగా నియమితులైన కీర్తిలో రేఖా గుప్తా కూడా చేరారని కేరింతలు కొట్టారు.
ఈ వార్తను కూడా చదవండి: Chicken: చికెన్ తినడం వల్ల అనారోగ్యం రాదు..
మల్లీశ్వరపు రాజేశ్వరి ఆధ్వర్యంలో..
మెట్టుగూడలో బీజేపీ ఓబీసీ విభాగం రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లీశ్వరపు రాజేశ్వరి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. స్థానిక మహిళలకు మిఠాయిలు తినిపించారు. బీజేపీ మహిళా పక్షపాతి అంటూ వారికి ఆమె తెలిపారు. శ్రీధర్‌గుప్తా, ప్రశాంత్, శ్రీను, రాజ్యలక్ష్మిగుప్తా, కాశమ్మ, జాన్వి, హేమలత తదితరులు పాల్గొన్నారు.
బాణుక నర్మద ఆధ్వర్యంలో
కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు బానుక నర్మద మల్లికార్జున్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న బీజేపీ బోయిన్‌పల్లి మహిళలతో కలిసి ఆమె గురువారం వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అధిష్టానం.. ప్రధాని మోదీ నాయకత్వంలో.. మహిళలకు గొప్ప అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రపతిగా ముర్ము, కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్‌లు కొనసాగడమే అందుకు నిదర్శనమన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మహిళలకు బీజేపీ పెద్దపీట వేసిందన్నారు. అదేవిధంగా రాబోయే రోజులలో కంటోన్మెంట్‌లోను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్‌ల ప్రోత్సాహంతో రాజకీయపరంగా మహిళలకు తగిన అవకాశాలు కల్పిస్తూ వారిని గౌరవిస్తారనే విషయంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ 6వ వార్డు అధ్యక్షుడు ప్రతీక్ జైన్, మహిళా నాయకురాళ్లు స్వరూప తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట
ఈవార్తను కూడా చదవండి: యువ వైద్యురాలి ప్రాణం తీసిన ఈత సరదా
ఈవార్తను కూడా చదవండి: చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ
ఈవార్తను కూడా చదవండి: అడవి పందుల వేటకు వెళ్లి... విద్యుదాఘాతానికి ముగ్గురి బలి
Read Latest Telangana News and National News