Bhadradri: నేడు భద్రాద్రికి ముఖ్యమంత్రి
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:10 AM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

సీతారామస్వామి కల్యాణానికి హాజరు
పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం
సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం
రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్ ఖరారు
బూర్గంపాడు, భద్రాచలం, ఖమ్మం, కొత్తగూడెం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. కల్యాణం అనంతరం బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన బూరం శ్రీనివాసరావు అనే సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సన్న బియ్యం పంపీణిని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన నేపథ్యంలో సన్న బియ్యం అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కల్యాణానికి విచ్చేస్తున్న సీఎం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
శనివారం లబ్ధిదారుడి ఇంటిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సహ పలువురు ఉన్నతాధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, దేశంలోనే మొట్టమొదటిసారిగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎర్త్‌సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ఆమోదం తెలిపారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం భద్రాచలం విచ్చేస్తున్న సీఎం ఎర్త్‌సైన్సెస్ యూనివర్శిటీ మంజూరు ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..
సిట్ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here