డేంజర్ స్పాట్ దయ్యాలగండి
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:27 AM
ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌కు గొప్ప పేరుంది. అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా విరాజి ల్లుతుండడంతో ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు సాగర్‌ను చూసేందుకు వస్తుంటారు.

నాగార్జునసాగర్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌కు గొప్ప పేరుంది. అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా విరాజి ల్లుతుండడంతో ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు సాగర్‌ను చూసేందుకు వస్తుంటారు. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి-565 నిత్యం రద్దీగా ఉంటుంది. సాగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న మొదటి ఘాట్ వద్ద దయ్యాల గండి అనే ప్రాంతం వద్ద రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. సాగర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో సమ్మక్క-సారక్క జంక్షన్ నుంచి ఫైలాన్ కాలనీ వరకు మొత్తం ఎనిమిది మూల మలుపులు ఉం టాయి. ఈ మూల మలుపుల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎక్కువ ప్రమాదాలు మాత్రం దయ్యాలగండి వద్ద జరుగుతున్నాయి. ఇక్కడ మూల మలుపుతో పాటు రోడ్డుకు దగ్గరగా విద్యుత్ స్తంభాలు ఉండడంతో పాటు ఎదురుగా వచ్చే వాహనాలు కన్పించకుండా చెట్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి.
రోడ్డు విస్తరణకు నో..
సాగర్‌కు వెళ్లే దారిలో ఉన్న మూల మలుపులు సరిచేసి రోడ్డును విస్తరించడానికి అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ఇరుకుగా ఉందని, రోడ్డుకు అడ్డుగా పెరిగిన చెట్లను బీఅండ్‌ఆర్ అధికారులు చెట్లను తొలగించకపోవ డంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ఇక్కడ రోడ్డు దిగుడుగా(డౌన్) ఉంటుంది. రోడ్డు పక్కనే రెండు విద్యుత్ స్తంభాలు ఉండడంతో వాహనాలు పక్కకు వెళ్లడానికి అవకాశం లేదు. విద్యుత్ స్తంబాలు కూడా తరచూ ప్రమాదాలు జరగడానికి మరో కారణం. ప్రమాదాల నివారణకు దయ్యాలగండి వద్ద ప్లైఓవర్ వేస్తే అటవీ శాఖకు ఎటువంటి నష్టం ఉండదని స్థానికులు పేర్కొంటున్నారు. అసలే మలుపులు ఆపై ఇరుకు రోడ్డు ఉండడంతో రోడ్డు విస్తరణకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించకోవడం లేదు. దయ్యాలగండి రోడ్డులో 15 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 32రోడ్డు ప్రమాదాలు జరిగి 10మంది మృత్యువాత పడ్డారు. 24 మంది క్షతగాత్రులయ్యారు.
గాలిలో నిండు ప్రాణాలు..
దయ్యాలగండి వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతుండడంతో నిండు ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ ప్రమాదాలకు ఎవరు బాధ్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు విస్తరణకు అనుమతి ఇవ్వని అటవీశాఖ వారా? పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారుల అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి నెలా రెండు నుంచి మూడు ప్రమాదాలు జరుగున్నాయి. ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరెందరో క్షతగాత్రులవుతున్నారు. శనివారం జరిగిన ప్రమాదంలో మృతిచెందిన బాబుకు ఐదు సంవత్సరాలలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గాయపడిన అతని భార్య అనిత, బావమరిది నరేష్ పరిస్థితి కూడా విషమంగా ఉంది. అటవీ శాఖ అధికారులు రోడ్డు విస్తరణకు అనుమతులు ఇచ్చి ప్రమాదాలు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు కూడా చొరవ తసుకొని రోడ్డును విస్తరించాలని పలువురు వాహనదారులు, పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
నాగార్జునసాగర్ దయ్యాలగండి ప్రాంతం వద్ద తరుచూ ప్రమాదాలు జరుగుతన్నాయి. ఇందుకు కారణం మూలమలుపులు ఉండడంతో పాటు ఘాట్ రోడ్డు కావడంతో సాగర్ వైపు నుంచి వాహనాలు వేగంగా కిందికి వెళ్తుంటాయి. ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడిరోడ్డు విస్తరించి మలుపులు లేకుండా చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటాం.
సంపత్, నాగార్జునసాగర్ ఎస్‌ఐ.

హెచ్‌సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు..

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి పేరు ఖరారు

ఇతర వర్గాలను కించపరిచే పాటలు, ప్రసంగాలు వద్దు

పనిచేసేది హోంగార్డుగా.. గ్రూపు-4లో ఉద్యోగం ఇప్పిస్తానని..

నవమి శోభాయాత్రకు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు
