రాజారాంలో తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 10:32 PM
వేసవికి ముందే తాగునీటి కష్టా లు మొదలయ్యాయి. మండలంలోని రాజారాం గ్రామంలోని ఎస్టీ కాలనీ లో బోరు మోటారు చెడిపోవడంతో నీటి సమస్య తలెత్తింది.

కోటపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : వేసవికి ముందే తాగునీటి కష్టా లు మొదలయ్యాయి. మండలంలోని రాజారాం గ్రామంలోని ఎస్టీ కాలనీ లో బోరు మోటారు చెడిపోవడంతో నీటి సమస్య తలెత్తింది. ఈ సమ స్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరు పట్టించుకోవ డం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు అరకి లోమీటరు దూరం నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడగా పం చాయతీ కార్యదర్శి ఉదయ్ వీరికి గ్రామపంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటి ని సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకర్ రాగానే కాలనీ వాసులంతా ఎగబడి వచ్చి బిందెలతో నీరు పట్టుకుంటున్నారు. నాయకులు, అధికా రులు స్పందించి తక్షణమే మోటారుకు మరమ్మతులు చేయిస్తే సమస్య పరిష్కారం అవుతుందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. మరమ్మ తు లకు నిధుల కొరత ఉండడంతోనే మోటారు బాగు చేయించలేకపోయా యనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.