Share News

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి

ABN , Publish Date - Mar 16 , 2025 | 10:34 PM

ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ తెలంగాణ స్టేట్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌టీయుటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు బట్టారి వెంకటేశ్వర్లు

ఎస్‌టీయుటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

మంచిర్యాల క్రైం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ తెలంగాణ స్టేట్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ప్రథమ కార్యవర్గ సమావేశానికి హాజరై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పాఠశాలలను బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. 317 జీవో ప్రకారం స్పౌస్‌ పరస్పర బదిలీలు చేస్తామని, డీఏలు, పీఆర్‌సీలు ఇస్తామని శాసన సభలో ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడి ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని చెప్పడం శోచనీయమన్నారు. పెండింగ్‌ బిల్లులు, జీపీ ఎస్‌ సెలెండర్లు, మెడికల్‌ రీయంబర్స్‌మెంట్‌ బిల్లులు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కారం కానిపక్షంలో ఎలాంటి ఉద్యమాలకైన సిద్దమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 10:34 PM

News Hub