BJP: సిద్ధాంతానికి కట్టుబడి పనిచేస్తేనే బీజేపీలో గుర్తింపు
ABN , Publish Date - Apr 09 , 2025 | 10:05 AM
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అలాగే కేంద్రప్రభుత్వ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో తప్పనిసరిగా తగిన గుర్తింపు లభిస్తుందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్(Dr. K. Lakshman) పేర్కొన్నారు. రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి పదవీ స్వీకరణ కార్యక్రమం మంగళవారం మన్సూరాబాద్‌లో జరిగింది. బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా మాజీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా డాక్టర్ కె.లక్ష్మణ్, ఎంపీ ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: Ice Cream: ఫ్లేవర్ గుర్తిస్తే రూ. 3లక్షలు మీవే..
ఈ సందర్భంగా కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. వాజపేయి స్ఫూర్తితో వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి నాయకత్వంలో ప్రతి నాయకుడు, కార్యకర్త రంగారెడ్డి అర్బన్ జిల్లాలో పార్టీ పటిష్ఠతకు పాటుపడాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం(Congress, BRS, MIM) పార్టీల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోనూ బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎంపీ ఈటల మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో కేసీఆర్ వైఫల్యాలు ప్రజలకు అర్థమైతే, కేవలం తొమ్మిది నెలల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి పాలనలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విమర్శించారు.
రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బల్దియాపై బీజేపీ(BJP) జెండా ఎగరడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో రైతులు ధైర్యంగా ఉన్నారంటే ఇందుకు మోదీ ప్రభుత్వమే కారణమని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం పదవీబాధ్యతలు చేపట్టిన శ్రీనివా్‌సరెడ్డిని వారు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్కా కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్, కార్పొరేటర్లు, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, మహిళా మోర్చా నాయకురాళ్లు, తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం
నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్ ట్రైన్ లైన్లు
Read Latest Telangana News and National News