Share News

ధాన్యం సేకరణకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Mar 19 , 2025 | 12:35 AM

యాసంగి ధాన్యం మార్కెట్‌కు రానున్న నేపథ్యంలో ధాన్యం సేకరణకు పౌరసరఫరాలు, వ్యవసాయ అనుబంధ శాఖలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు.

ధాన్యం సేకరణకు సిద్ధం కావాలి
చందంపేట కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

నల్లగొండ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): యాసంగి ధాన్యం మార్కెట్‌కు రానున్న నేపథ్యంలో ధాన్యం సేకరణకు పౌరసరఫరాలు, వ్యవసాయ అనుబంధ శాఖలు సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ధాన్యం సేకరణ, మద్దతు ధరకు ధా న్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలకు ఉదయాదిత్య భవన్‌లో శనివారం నిర్వహించిన ఒకరోజు శిక్షణలో ఆమె మాట్లాడారు. ధాన్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు గ్రేడ్‌ ఏ రకానికి రూ.2,320లు, సాధారణ రకానికి రూ.2,300ల మద్దతు ధర ప్రకటించాయన్నారు. సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500ల బోనస్‌ ప్రకటించినట్లు తెలిపారు. ఈసంవత్సరం యాసంగిలో జిల్లావ్యాప్తంగా 2లక్షల హెక్టార్లు సాగైందని, 12లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశముందని అం చనా వేసినట్లు తెలిపారు. మార్కెట్‌కు 11లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. ఇందులో మిల్లర్లు 5,68,152మెట్రిక్‌ టన్నులు, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ ద్వారా 5,57,869 మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. సిబ్బంది కొనుగోలు కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడి న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశం లో జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ హరీష్‌, జిల్లా వ్య వసాయ అధికారి శ్రవణ్‌, డీసీవో పత్యనాయక్‌, డీఆర్డీవో శేఖర్‌రెడ్డి, ఛాయదేవి పాల్గొన్నారు.

. నల్లగొండ బైపాస్‌ జాతీయ రహదారి 565కు సంబంధించి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. నేషనల్‌ హైవే 565 న ల్గొండ బైపా్‌సపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, రెవెన్యూ అధికారుల తో మంగళవారం తన ఛాంబర్‌లో సమావేశమయ్యా రు. స్ట్రక్చర్లు, ఇతర నిర్మాణాలను సమీక్షించారు. స మావేశంలో అదనపు కలెక్టర్‌ జె. శ్రీనివాస్‌, జాతీయ రహదారుల సంస్థ విశ్రాంత భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సత్యనారాయణ, జాతీయ రహదారుల సంస్థ ధర్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రాజేంద్రప్రసాద్‌, నల్లగొండ ఆర్డీవో అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.

పంతులమ్మగా మారి.. పాఠాలు బోధించి..

చందంపేట: మండల పర్యటనలో భాగంగా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి కస్తూర్బాగాంధీ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు గణితం బోధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజ నం అందించాల ని సిబ్బందికి సూచించారు. అనంతరం మండల కేం ద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో మహిళా సంఘాల సమావేశంలో పాల్గొన్నారు. ఆడ పిల్లలను భారంగా కాకుండా బాధ్యతగా పెంచాలన్నారు. గర్భంలోనే ఆడశిశువులను చంపే సంస్కృతిని విడనాడాలన్నారు. అంతకుముందు పీహెచ్‌సీని తనిఖీ చేసి మౌలిక వసతులపై ఆరా తీశారు. ఏఎన్‌ఎం పోస్టు ఖాళీగా ఉందని మండల వైద్యాధికారి చందులాల్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీలక్ష్మీ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 19 , 2025 | 12:35 AM