Share News

Sircilla: ఇదీ మన సిరిసిల్ల నేతన్నల ప్రతిభ.. రాములోరి కల్యాణానికి బంగారు పట్టుచీర

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:58 AM

మన సిరిసిల్ల నేతన్నలు మరోసారి తమ ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికే ఎన్నో వస్ర్తాలను తయారు చేసిన వారు తాజాగా శ్రీరామనవమి సందర్భంగా తల్లి సీతాదేవికి బంగారు పట్టుచీరను తయారు చేసి తమ ప్రతిభను మరోమారు చాటుకున్నారు. ఈ బంగారు పట్టుచీరను భద్రాచలంలో జరిగే రామయ్య, సీతాదేవిల కల్యాణానికి పంపిస్తున్నారు.

Sircilla: ఇదీ మన సిరిసిల్ల నేతన్నల ప్రతిభ.. రాములోరి కల్యాణానికి బంగారు పట్టుచీర

సిరిసిల్ల: సిరిసిల్ల నేత కళాకారులు యెల్ది హరిప్రసాద్‌, నల్ల విజయ్‌(Yeldi Hariprasad, Nalla Vijay)లు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. మరమగ్గాలపై తమ కళా నైపుణ్యంతో అద్భుతంగా చీరలను తీర్చిదిద్దు తున్నారు. ఈనెల 6న జరిగే భద్రాద్రి సీతారాముల కల్యాణానికి బంగారు పట్టుచీరను హరిప్రసాద్‌ సిద్ధం చేశారు. అలాగే నల్ల విజయ్‌ పువ్వుల డిజైన్‌తో కూడిన బంగారు చీరను నేశారు. ఈ ఇద్దరి కళాకారుల ప్రతిభను చూసి పలువురు అభినందిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ జింకకు పెద్ద కష్టమే వచ్చిందిగా..


సీతారాముల కల్యాణానికి బంగారు పట్టుచీర..

z3.jpg

సీతారాముల కల్యాణం జనులందరూ ఎంతో సం బురంగా జరుపుకుంటారు. అందులో ముఖ్యంగా భద్రాదిలో జరిగే వేడుకలకు తరలివెళ్తారు. ఆ రాము డికి మరోసారి సిరిసిల్ల నేత కళాకారుడు యెల్ది హరి ప్రసాద్‌ మరో అద్భుతమైన బంగారు వర్ణంతో పట్టు చీరను సిద్ధం చేశాడు. ఈనెల 6న భధ్రాది దేవాల యంలో జరిగే సీతారాముల కల్యాణపు వేడుకలకు అందించనున్నారు. రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla) జిల్లా కేంద్రంలో విభిన్నమైన చీరలను తయారుచేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన హరి ప్రసాద్‌ 5.50 మీటర్లు 800 గ్రాముల బరువు గల చీరలో వన్‌ గ్రామ్‌ గోల్డ్‌ జరీని ఉపయోగించి చేనేత మగ్గంపై చీరను నేశారు.


z1.jpg

చీరపై సీతారాములు, లక్ష్మణుడు, ప్రతి రూపా లను నేశాడు. ఆరు రోజుల పాటు శ్రమించి తయారు చేసిన ఈ చీర కొంగుపై భధ్రాది ఆలయ మూలవిరాట్‌ దేవతామూర్తులను నేశారు. చీర బోర్డర్‌లో శంఖు, చక్రనామాలు, హనుమంతు డు, గరుత్మంతుల ప్రతిరూపాలు నేశా డు. చీరలో శ్రీరామ, శ్రీరామ రామేతి రమే రామే మనోరమే, సహస్త్ర నామతాత్యుల్యం అనే శ్లోకాన్ని వచ్చే విధంగా 51సార్లు పొందు పర్చారు. అద్భుతంగా తయారైన చీరను కల్యాణం సందర్భంగా అందించనున్నారు. రెండు సంవత్సరాలుగా సీతారామ కల్యాణం సందర్భంగా చీరలను నేసి అందిస్తున్నారు.


ఆకర్షణీయంగా బంగారు చీర..

z2.jpg

సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల విజయ్‌ చేనేత మగ్గంపై అబ్బురపరిచే చీరలను నేస్తున్నాడు. తాజాగా పువ్వుల డిజైన్‌తో బంగారాన్ని ఉపయో గించి ఆకర్షణీయంగా చేనేత మగ్గంపై చీరను నేశాడు. బళ్లారికి చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమార్తె కోసం 20 గ్రాముల బంగారాన్ని ఉప యోగించి చీరను నేయాలని విజయ్‌కు అర్డర్‌ ఇచ్చాడు. చీరపై బంగారు వర్ణంతో పువ్వులు పూసినట్లుగా నేశాడు. 5.50 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో 800 గ్రాములు ఉన్న ఈ చీర ను పది రోజులు శ్రమించి నేశాడు. గతంలో 200 గ్రాములు బంగారంతో చీరను నేశాడు. వెండి ని ఉపయోగించి రంగులు మార్చే చీరను, 222 రంగులతో పరిమళించే పట్టు చీరను తయారు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

చెడగొట్టు వానకు రైతు విలవిల!

ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ

రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..

Updated Date - Apr 05 , 2025 | 11:58 AM