Share News

HCU: క్యాంపస్‌ నుంచి బలగాలను ఉపసంహరించండి

ABN , Publish Date - Apr 06 , 2025 | 05:30 AM

హెచ్‌సీయూ క్యాంపస్‌ నుంచి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమిని కాపాడుకునేందుకు ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వర్సిటీ ప్రొఫెసర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

HCU: క్యాంపస్‌ నుంచి బలగాలను ఉపసంహరించండి

  • హెచ్‌సీయూ ప్రొఫెసర్ల సంఘం డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): హెచ్‌సీయూ క్యాంపస్‌ నుంచి పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూమిని కాపాడుకునేందుకు ఉద్యమించిన విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని వర్సిటీ ప్రొఫెసర్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం సంఘం అధ్యక్షుడు భూక్యా బాంగ్యా ఒక ప్రకటన విడుదల చేశారు. హెచ్‌సీయూకి ప్రభుత్వం ఇచ్చిన మొత్తం భూమిని.. అంటే ఆ 400 ఎకరాలతో సహా 2,300 ఎకరాలను వర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రొఫెసర్ల సంఘం కోరింది. హెచ్‌సీయూ భూమిలో జీవ వైవిధ్య వారసత్వ మండలాలను గుర్తించి అధికారికంగా ప్రకటించాలని సూచించింది. హెచ్‌సీయూ భూమికి సరిహద్దు గోడ నిర్మించాలని డిమాండ్‌ చేసింది.


54 మంది హెచ్‌సీయూ విద్యార్థులపై కేసు

హెచ్‌సీయూలో 54 మంది ఏబీవీపీ విద్యార్థులపై గచ్చిబౌలి ఠాణాలో కేసు నమోదైంది. పీహెచ్‌డీ విద్యార్థి అబ్రహం తదితరులపై 175 బీఎన్‌ఎ్‌సఎ్‌స సెక్షన్‌ కింద పోలీసులు కేసు పెట్టారు.

Updated Date - Apr 06 , 2025 | 05:30 AM