Jana Reddy - KTR : కేటీఆర్ జానారెడ్డి మధ్య సరదా సంభాషణ.. ఏమన్నారో తెలుసా

ABN, Publish Date - Mar 17 , 2025 | 09:52 PM

Jana Reddy KTR Meeting: సీనియర్ నేత జానా రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. జానా రెడ్డి వద్దకు వచ్చిన కేటీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు.

Jana Reddy  - KTR : కేటీఆర్ జానారెడ్డి మధ్య సరదా సంభాషణ.. ఏమన్నారో తెలుసా
Jana Reddy - KTR Meeting

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఇవాళ(సోమవారం) అఖిలపక్ష సమావేశం జరిగింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అఖిలపక్షం భేటీలో డీలిమిటేషన్‌ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంలో డీలిమిటేషన్ సమస్యపై పార్టీల అభిప్రాయాలు తెలుసుకున్నామని అన్నారు. ఐక్యంగా డీలిమిటేషన్‌పై పోరాడాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అందరి సూచనలు తీసుకోమని ప్రభుత్వం తనకు చెప్పిందని.. తాను తీసుకుంటున్నానని తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. తమిళనాడులో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి అన్ని పార్టీల నుంచి నేతలు హాజరవుతారని తెలిపారు. ఈ పోరాటంలో చివరకు అందరం ఒక్క దగ్గర కలుస్తామని జానారెడ్డి పేర్కొన్నారు.


జానారెడ్డి,కేటీఆర్ మధ్య సరదా సంభాషణ

సీనియర్ నేత జానారెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. జానారెడ్డి వద్దకు వచ్చిన కేటీఆర్ ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. ఆరోగ్యం బాగుందని.. తన ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా అని జానారెడ్డి అడిగారు. 70 పైన ఉండొచ్చు అనుకుంటున్నానని కేటీఆర్ తెలిపారు. కాదు 79 ఏళ్లు పూర్తయ్యాయని జానారెడ్డి తెలిపారు. మీ ఆధ్వర్యంలో జై వీర్ బాగా రాటు దేలుతున్నారని కేటీఆర్ అన్నారు. జానారెడ్డి అంకుల్‌తో ఫొటో దిగడానికి తనకు భయం ఎందుకని కేటీఆర్ చెప్పారు.


డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం:కేటీఆర్

డీలిమిటేషన్ అంశంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టత లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈరోజు పిలిచిన అఖిలపక్ష సమావేశ నిర్వహణపై ప్రభుత్వానికి స్పష్టత లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిపైన వారికే స్పష్టత లేదన్నారు. దేశంలో అందరికంటే ముందు డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు, దక్షిణాది రాష్ట్రాలకు జరుగబోయే నష్టాల గురించి మాట్లాడామని అన్నారు. డీఎంకే పార్టీ కన్నా ముందే చాలా కాలం నుంచి డీ లిమిటేషన్‌తో దక్షిణాదికి జరగబోయే నష్టం గురించి జాతీయ వేదికల పైన తాము మాట్లాడుతున్నామని కేటీఆర్ చెప్పారు.


దేశ ప్రయోజనాల కోసం పాటుపడిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ విధానంతో నష్టం జరుగుతుందని చెబుతూ వస్తున్నామని అన్నారు. డీలిమిటేషన్‌పైన జరిగే నష్టాలపైన కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెబుతామని చెప్పారు. డీలిమిటేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పైన పోరాడుతామని తెలిపారు. డీలిమిటేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని.. ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డీలిమిటేషన్ విషయంలో స్పష్టత ఉందని తెలిపారు.డీలిమిటేషన్ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉన్న బాధ్యత ఏమిటో చెప్పాలని అన్నారు. ఈనెల 22వ తేదీన చెన్నైలో జరిగే డీఎంకే సమావేశానికి హాజరవుతామని తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ తరఫున తాను హాజరై పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తామని కేటీఆర్ అన్నారు.


తమిళనాడుకు కేటీఆర్

ఈ నెల 22వ తేదీన తమిళనాడుకు కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం వెళ్లనుంది. పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ సమస్యపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ నేతలు హాజరుకానున్నారు. అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ ఈమధ్యనే డీఎంకే నేతలు తెలంగాణ భవన్‌కు వచ్చి బీఆర్ఎస్‌ నేతలను ఆహ్వానించిన విషయం తెలిసిందే.


డీ లిమిటేషన్‌పై ఐక్యంగా పోరాటం చేయాలి: జూలకంటి రంగారెడ్డి

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని రేవంత్ ప్రభుత్వాన్ని తాము కోరామని సీపీఎం సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన డీ లిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీ లిమిటేషన్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి కోసం ఐక్యంగా పోరాటం చేయాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్

Hyderabad: ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..

For Telangana News And Telugu News

Updated Date - Mar 17 , 2025 | 10:02 PM