Formula E-Car Race Case: ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం. . మరోసారి కేటీఆర్‌కు..
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:32 PM
Formula E-Car Race Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు పంపనున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Race Case) కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను ఏసీబీ విచారించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ అధికారులు ఇవాళ(సోమవారం) విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ వెళ్తూ.. తన న్యాయవాదులను కూడా తీసుకెళ్లారు. అయితే ఏసీబీ అధికారులు న్యాయవాదులను అనుమతిచ్చామని స్పష్టం చేశారు. దీనిపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
విచారణకు రాకుండా కేటీఆర్ ఓ లేఖను అధికారులకు పంపించారు. కేటీఆర్ విచారణకు రాకపోవడంతో ఏసీబీ అధికారులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈరోజు మరోసారి కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం. ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు పిలిచారు. అయితే నేడు విచారణకు కేటీఆర్ రావకపోవడంతో మరోసారి నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం. న్యాయవాది సమక్షంలో విచారణ కోసం న్యాయస్థానాన్ని కేటీఆర్ ఆశ్రయించునున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పును రిజర్వ్‌లో న్యాయస్థానం ఉంచింది. రేపు విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ విచారణకు సమయం కోరే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఏపీ, తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి
Minister Ponnam Prabhakar: క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తాం
KTR: నమ్మక ద్రోహం కాంగ్రెస్ నైజం
Bhatti Vikramarka: గురుకుల విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం
Read Latest Telangana News and Telugu News