Minister Ponguleti: మా జోలికొస్తే తాట తీస్తాం.. కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:47 AM
Minister Ponguleti Srinivasa Reddy: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తమ జోలికివస్తే తాట తీస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా దోచుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికార దాహంతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి అంటే కేసీఆర్ ఆత్మ అని ఆరోపణలు చేశారు. ఇవాళ(మంగళవారం) హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మాటలనే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారని అన్నారు. ధరణి పోర్టల్‌తో భూములను అక్రమంగా దోచుకుని.. వారి అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. అక్రమంగా దోచుకున్న భూములను తమ ప్రభుత్వం.. వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో అక్రమ సంపాదనతో లాభపడ్డ నేతలే తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనాలని వారు చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారికి సంకెళ్లు వేసి తీరుతామని అన్నారు. బీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారలేదని చెప్పారు. ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనాలని సవాల్ విసిరారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చి ఆ కుర్చీలో కూర్చోవాలని.. తండ్రీ, కొడుకులు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Narendra Modi: తెలంగాణలో అడవులపైకి బుల్డోజర్లు
KTR: ఒక్కసారి ఓటేస్తే.. ఐదేళ్ల శిక్షగా మారింది!
Kishan Reddy: అంబేడ్కర్‌ను అవమానించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ది
Read Latest Telangana News And Telugu News