Share News

Hyderabad: నార్సింగి పోలీసులను మరోసారి ఆశ్రయించిన నటి లావణ్య.. ఈసారి ఎందుకంటే..

ABN , Publish Date - Feb 04 , 2025 | 02:38 PM

హైదరాబాద్: ఆర్జే శేఖర్ బాషా, మస్తాన్ సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నటి లావణ్య ఫిర్యాదు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారంటూ ఆధారాలతో సహా ఆమె పోలీసులను ఆశ్రయించారు.

Hyderabad: నార్సింగి పోలీసులను మరోసారి ఆశ్రయించిన నటి లావణ్య.. ఈసారి ఎందుకంటే..
Actress Lavanya

హైదరాబాద్: నార్సింగి(Narsingi) పోలీస్ స్టేషన్‌ను సినీ నటి లావణ్య (Actress Lavanya) మరోసారి ఆశ్రయించారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషా (RJ Shekhar Basha)పై ఆమె ఫిర్యాదు చేశారు. మస్తాన్ సాయి (Mastan Sai), శేఖర్ బాషా తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశారంటూ లావణ్య ఆరోపించారు. ఇందుకు సంబంధించి మస్తాన్ సాయి, శేఖర్ బాషా మాట్లాడుకున్న ఆడియో ఆధారాలను పోలీసులకు నటి అందజేశారు. తనతోపాటు మరో యువతిని సైతం డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు వారిద్దరూ ప్రయత్నించారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.


కాగా, రాజ్ తరుణ్, నటి లావణ్య కేసు నిన్న(సోమవారం) కీలక మలుపు తిరిగింది. రాజ్ తరుణ్, తాను విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అంటూ నార్సింగి పోలీసులను ఆమె ఆశ్రయించారు. అతను చాలా మంది అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి వారు మత్తులో ఉన్నప్పుడు లైంగిక దాడి చేసేవాడని, అలాగే వారి నగ్న వీడియోలను రికార్డు చేసేవాడని లావణ్య తన ఫిర్యాదులో సంచలన విషయాలను వెల్లడించారు. ఆ వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేసేవాడని తెలిపారు. దీనికి సంబంధించి 200 వీడియోలు ఉన్న హర్డ్ డిస్క్‌ను పోలీసులకు ఆమె అందజేశారు. వీటిని మస్తాన్ సాయి ఇంటి నుంచి తెచ్చినట్లు చెప్పుకొచ్చారు.


హర్డ్ డిస్క్‌లో హీరో నిఖిల్, వరలక్ష్మి టిఫిన్స్ ప్రభాకర్ రెడ్డికి చెందిన ప్రైవేటు వీడియోలూ ఉన్నట్లు లావణ్య తెలిపారు. ఈ క్రమంలోనే తాను బట్టలు మార్చుకుంటుండగా స్పై కెమెరాలు పెట్టి రికార్డు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను అడ్డం పెట్టుకుని యువతులపై లైంగిక దాడికి పాల్పడేవాడని ఫిర్యాదు చేశారు. లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని సోమవారం అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, నేడు తాజాగా ఆమె ఆర్జే శేఖర్ బాషాపై ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. అసెంబ్లీలో కీలక ప్రకటనకు ఛాన్స్

Tirupati.. ఉత్కంఠగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక..

Updated Date - Feb 04 , 2025 | 03:15 PM