Shabbir Ali: ఆ విషయంపై చర్చకు రా కేటీఆర్ తేల్చుకుందాం.. షబ్బీర్ అలీ మాస్ సవాల్
ABN, Publish Date - Jan 03 , 2025 | 04:35 PM
Shabbir Ali: 2008 లో రూ.4.32 కోట్ల అఫిడవిట్ చూపించిన కేటీఆర్ 2009లోరూ. 7.99 కోట్లు చూపించారని.. ఇన్ని ఆస్తులు ఎలా పెరిగాయని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. . కేటీఆర్ ఐఏఎస్ అఫీసర్లను బకరాలను చేశారని మండిపడ్డారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలకు సిగ్గు, శరం ఏం లేదని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ విమర్శించారు. మాజీ మంత్రి కేటీఆర్ అవినీతిపై ఓపెన్ చాలెంజ్ చేశారు. ఉద్యమంలో కూడా కేటీఆర్ ఆస్తులు పెరిగాయని ఆరోపించారు. ఇవాళ(శుక్రవారం) గాంధీభవన్‌లో షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... కేటీఆర్ ఇన్ని అస్తులు పెరగడానికి కారణమైన అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని చూపెట్టాలని అన్నారు. తాము ఎన్నికల కోసం ఆస్తులు అమ్ముతున్నామని. మీకు ఆస్తులు ఎలా పెరుగుతున్నాయని ప్రశ్నించారు. కేటీఆర్ ఐఏఎస్ అఫీసర్లను బకరాలను చేశారని మండిపడ్డారు. 2008లో రూ.4.32 కోట్ల అఫిడవిట్ చూపించిన కేటీఆర్ 2009లో రూ. 7.99 కోట్లు చూపించారని.. ఇన్ని ఆస్తులు ఎలా పెరిగాయని నిలదీశారు. 2023లో రూ. 50 కోట్లకు పైగా కేటీఆర్ ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు హరీష్‌రావు, కవితల ఆస్తులు కూడా భారీగా పెరిగాయని ఆరోపించారు. గతంలో పార్లమెంటు జరిగే సమయంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేటప్పుడు రూల్స్ గుర్తుకు రాలేదా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీకి ఆ అర్హత లేదు: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
హైదరాబాద్: ధర్నాచౌక్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధర్నాచేయడం చాలా వింతగా ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తేసిన ధర్నాచౌక్ దగ్గరకు.. ఇప్పుడు కవిత వెళ్లి ధర్నా చేయడం నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టిందని గుర్తుచేశారు. బీసీల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని ధ్వజమెత్తారు. కవిత, కేసీఆర్ ఫామ్‌హౌస్ ముందుకు వెళ్లి ధర్నా చేయాలని అన్నారు. పదేళ్ల పాలనలో బీసీలకు ఏం చేయనందుకు ఫార్మ్‌హౌస్ దగ్గర ధర్నా చేయాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో మీ కార్యవర్గంలో ఎవరైనా బీసీలు ఉన్నారా అని ప్రశ్నించారు. ఒక బీసీ మహేష్ గౌడ్‌ని పార్టీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ చేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ కులగణనను కూడా విమర్శించిదని మండిపడ్డారు. అలాంటి బీఆర్ఎస్ పార్టీకి ధర్నాలు చేసే నైతిక హక్కు లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Kavitha: కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందే: ఎమ్మెల్సీ కవిత డిమాండ్..
Bhatti Vikramarka: ఆ ఘనత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుంది: డిప్యూటీ సీఎం భట్టి..
TG News: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ విషయం తెలుసుకుంటే ఎగిరి గంతేస్తారు..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jan 03 , 2025 | 04:48 PM