Share News

Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి బెయిల్

ABN , Publish Date - Jan 14 , 2025 | 10:21 AM

Kaushik Reddy: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ముందుస్తుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి బెయిల్
Kaushik Reddy

కరీంనగర్: కరీంనగర్ రెండో అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ముందు కౌషిక్ రెడ్టిని పొలీసులు హాజరు పరిచారు. అంతకుముందు కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌషిక్ రెడ్టికి వైద్యపరీక్షలు చేశారు. అయితే కౌషిక్ రెడ్టి రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం పిటిషన్ వేసింది. రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్‌పై వాదనలు కొనసాగుతున్నాయి...మరికాసేపట్లో రిమాండ్ రిపోర్ట్‌పై జడ్జి ఉత్తర్వులు ఇవ్వనున్నారు. కౌశిక్ రిమాండ్‌పై ఉత్కంఠ నెలకొంది. కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. రూ. 50వేల పూచికత్తు ఇద్దరు షూరిటీతో మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది.


కాగా..హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్‌ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ముందుస్తుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పాడి కౌశిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌశిక్‌రెడ్డిపై ఆది, సోమవారాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికలో భాగంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడ్డుకొని, దాడికి యత్నించారని సంజయ్‌ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


అరెస్టు అన్యాయం: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తునందుకే తనను అక్రమంగా అరెస్ట్ చేశారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. కోర్టుకు వెళ్లే క్రమంలో మీడియాతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. అరెస్ట్ చేసినా ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు.ఆరు గ్యారంటీలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు.. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నిస్తామన్నారు.ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని విరుచుకుపడ్డారు. సంక్రాంతి పండుగ పూట అరెస్టులు అన్యాయమని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Harish Rao: కేటీఆర్, హరీష్‌రావును చుట్టుముట్టిన పోలీసులు.. అసలు కారణమిదే

Karimnagar: కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌!

Harish Rao: రైతులు, కూలీలకు కాంగ్రెస్‌ కుచ్చుటోపీ!

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jan 14 , 2025 | 10:28 AM