Share News

Jagtial Politics: వేడెక్కిన జగిత్యాల రాజకీయాలు.. జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య ముదురుతున్న వార్..

ABN , Publish Date - Apr 08 , 2025 | 05:10 PM

అధికారం చెలాయించేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తానింకా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని జీవన్ రెడ్డికి ఎందుకంత అసహనమో అర్థం కావడం లేదని మండిపడ్డారు.

Jagtial Politics: వేడెక్కిన జగిత్యాల రాజకీయాలు.. జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ మధ్య ముదురుతున్న వార్..
Jeevan Reddy Vs Sanjay Kumar

జగిత్యాల: జగిత్యాల నియోజకవర్గ రాజకీయాలు(Jagtial Politics) ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy), ఎమ్మెల్యే సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) ఒకరిపై మరొకరు చేసుకుంటున్న వ్యాఖ్యలు సంచలన రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో ఎమ్మెల్యే సంజయ్ చేరడాన్ని మెుదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి నిన్న(ఆదివారం) ఆయనపై విమర్శలు గుప్పించారు.


పదేళ్లపాటు బీఆర్ఎస్ హయాంలో అధికారం చెలాయించి, ఇప్పుడు మళ్లీ నియోజకవర్గంలో పెత్తనం చేసేందుకే కాంగ్రెస్‌లో చేరారంటూ సంజయ్‍పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాజాగా స్పందించారు. తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానంటే జీవన్ రెడ్డికి ఎందుకంత ఉలికిపాటో అర్థం కావడం లేదని కౌంటర్ ఇచ్చారు. జీవన్ రెడ్డికి ఎందుకంత అసహనమో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.


కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఓ న్యాయం.. మిగతా వారందరికీ మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ నేతలకు ఆయన కండువా కప్పలేదా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తన వెంట తిరిగి అనుకూలంగా పని చేసిన బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు, డీసీసీ ఛైర్మన్లు సహా చాలా మందిని కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి చేర్చుకున్నారంటూ ఆరోపించారు.


తాను చేస్తే ఒప్పు.. మిగతా వాళ్లు చేస్తే తప్పన్నట్లు ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనకు ఇవే చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి చెప్పారని, మరి మీ స్థానంలో కొత్త నాయకత్వం రావొద్దా? అంటూ సూటిగా ప్రశ్నించారు. జీవన్ రెడ్డికి నీతులు చెప్పాలని అనుకోవడం లేదని, ఆయన హుందాగా నడుచుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చురకలు అంటించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఇదే నా సవాల్.. సిద్ధమా?: కేంద్ర మంత్రి బండి సంజయ్..

Attack On jagan Helicopter: రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. పార్టీ అధినేత హెలికాఫ్టర్‌పైనే దాడి..

Updated Date - Apr 08 , 2025 | 05:13 PM