రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:25 AM
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యతని, బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతుం దని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ ఆరోపించారు. శనివారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారం భించారు.

గోదావరిఖని ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యతని, బీజేపీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతుం దని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ ఆరోపించారు. శనివారం గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో తలపెట్టిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారం భించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జై బాపు, జై భీమ్, జైసంవిధాన్ నినాదంతో అంబేద్కర్ రచించిన రాజ్యాం గాన్ని పరిరక్షించేందుకు ఈ యాత్ర నియోజకవర్గంలో పది రోజులు జరుగుతుందని, 50డివిజన్లతో పాటు మండల కేంద్రాల్లో గడప గడపకు వెళ్లి రాజ్యాంగ ఆవశ్యకతను ప్రజలకు వివరించనున్నట్టు ఆయన చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ కేవలం నినాదం కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. విభజించు పాలించు అనే నినాదంతో బీజేపీ ముందుకు వెళుతుందని, దీనిని ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపుని చ్చారు. ప్రజల మధ్య మత, రాగ ద్వేషాలను రెచ్చ గొడుతూ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతుందన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను గడపగడపకు వెళ్లే ఈ యాత్రలో ప్రజలకు వివరించాలని, అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారు. అనంతరం కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. నాయకులు మహంకాళి స్వామి, ఎండీ ముస్తాఫా, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, రవికుమార్, తిప్పారపు శ్రీనివాస్, దీటి బాలరాజు, ఉల్లంగుల రమేష్, గట్ల రమేష్, కొప్పుల శంకర్, యుగంధర్, పాతిపెల్లి ఎల్లయ్య, పాల్గొన్నారు.