నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:22 AM
రామగుండం పట్టణంలోని 20వ డివిజన్ ఏరియాలో గల గురుకుల పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సందర్శించారు. ఎమ్మెల్యే పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించి అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

అంతర్గాం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): రామగుండం పట్టణంలోని 20వ డివిజన్ ఏరియాలో గల గురుకుల పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సందర్శించారు. ఎమ్మెల్యే పాఠశాల ప్రాంగణాన్ని సందర్శించి అక్కడ విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ విద్యా బోధన తీరు, భోజనం ఎలా ఉందని తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లా డుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాల న్నారు. ఎమ్మెల్యే అంతర్గాం మండల పరిధిలోని ముర్మూర్, మొగల్ పహాడ్ గ్రామంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించి మాట్లాడారు. పేదల కడుపు నింపడానికే రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేస్తు న్నారని పేర్కొన్నారు. తహసీల్దార్లు తూము రవీందర్ పటేల్, కుమార స్వామి, ఎంపీడీఓ వేణు, ప్రిన్సిపాల్ కొప్పుల మాధవి, కాంగ్రెస్ నాయ కులు మహంకాళి స్వామి, శేఖర్, నారాయణ, రజిత, సునీత, కమల, జ్యోతి,శ్రీనివాస్ పాల్గొన్నారు.