Share News

రాజీవ్‌ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవాలి

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:47 AM

జిల్లాలోని అర్హులైనవారి నుంచి రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ఝా తెలిపారు.

రాజీవ్‌ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవాలి

సిరిసిల్ల కలెక్టరేట్‌ ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అర్హులైనవారి నుంచి రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ఝా తెలిపారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గా లు(ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ధ, జైన్‌, పార్శి)లకు చెందిన నిరుద్యో గ యువత, ఇతరులకు ఉపాధి అవకాశాలు ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించిందని తెలిపారు. ఈ మేరకు రాజీ వ్‌ యువ వికాసంపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు, ఎంపీడీవోలు, తహ సీల్దార్లు, బ్యాంకర్లతో మంగళవారం అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా రాజీవ్‌ యువ వికాసం పథకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివ రించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో దాదాపు రూ పది వేల కోట్లతో పథకానికి రూపకల్పన చేసిందని వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన వారందరూ తమ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయాలు, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వాటి కావాల్సిన పత్రాలు జతచేసి అందజేయాలని సూచించారు. తహసీల్దార్లు కులం, ఆదాయం సర్టిఫికెట్ల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయాలు మున్సిపల్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. గడువులోగా వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి మండల్‌ లెవెల్‌ కమిటీకి పంపిస్తారని వివరించారు. ఆ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత జిల్లా కమిటీకి పంపిస్తార ని వెల్లడించారు. అనంతరం అర్హులు ఎంపిక చేసుకున్న రుణాలకు సంబంధించిన శిక్షణను అందజేస్తారని తెలిపారు. అభ్యర్థులు, పూరించి న దరఖాస్తు ఫారమ్‌ను హార్డ్‌కాపీ, అవసరమైన పత్రాలను జత పరిచి మండల ప్రజాపాలన సేవా కేంద్రం(గ్రామీణప్రాంతాల్లో ఎంపీడీవో కార్యాలయం) లేదా మున్సిపల్‌ కమిషనర్‌ (పట్టణప్రాంతాలు)లో సమ ర్పించాలని స్పష్టం చేశారు. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, ఆదాయ ధృవీక రణ పత్రం, కుల ధృవీకరణ పత్రం (తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వా త జారీచేసినది), శాశ్వత డైవ్రింగ్‌ లైసెన్స్‌ (రవాణా రంగ పథకాలకు), పట్టాదార్‌ పాస్‌ బుక్‌ (వ్యవసాయ పథకాలకు), సదరం సర్టిఫికెట్‌ (పీడబ్లూడీ కోసం), పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో, దుర్బల(బలహీన) సమూ హ ధ్రువీకరణ పత్రం (మండల స్థాయి కమిటీ ధృవీకరించబడి నది) అవసరం అవుతాయన్నారు. మిగతా వివరాలకు జిల్లా బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో సంప్రదించాలని కలెక్టర్‌ సూచించా రు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీవో శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్‌ కుమార్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 12:47 AM