NTPC Fined: పెద్దపల్లిలో ఎన్టీపీసీకి బిగ్ షాకిచ్చిన మున్సిపల్ శాఖ
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:09 PM
NTPC Fined: పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీకి రామగుండం మున్సిపల్ శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో ఆరు చోట్ల అనుమతులు లేకుండా ఎన్టీపీసీ యాజమాన్యం నిర్మాణాలు చేపడుతోంది.

పెద్దపల్లి జిల్లా, ఏప్రిల్ 3: జిల్లాలోని రామగుండం (Ramagundam) కార్పొరేషన్ పరిధిలో అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎన్టీపీసీ (NTPC) సంస్థకు మున్సిపల్ శాఖ భారీ జరిమానా విధించింది. ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో ఆరు చోట్ల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న ఎన్టీపీసీ యజమాన్యానికి రూ.99.28 కోట్ల జరిమానను జిల్లా అదనపు కలెక్టర్ అరుణ శ్రీ విధించారు. ఈ విషయాన్ని మున్సిపల్ అధికారలు ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో ఎన్టీపీసీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది మున్సిపల్ శాఖ. నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకపోతే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేసింది. నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోకుండా మొత్తం ఆరు చోట్ల ఎన్టీపీసీ అక్రమ నిర్మాణాలు చేపడుతోంది. గతంలో ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ అనేక సార్లు హెచ్చరించి నోటీసులు పంపించినప్పటికీ ఎన్టీపీసీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ శాఖ ఏకంగా రూ.99 కోట్ల 28 లక్షల జరిమానాను ఎన్టీపీసీకి విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అడిషనల్ కలెక్టర్ అరుణ శ్రీ పేరుపై ఉత్తర్వులను జారీ చేసింది మున్సిపల్ శాఖ. జరిమాన చెల్లించకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో హెచ్చరించింది.
Kakani Skipping Police Inquiry: కాకాణి హైడ్రామా.. పోలీసులకు సహకరించని మాజీ మంత్రి
మరోవైపు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కచ్చితంగా అక్రమ నిర్మాణాలు, నాలాల కబ్జాలు చేస్తూ.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది మున్సిపల్ శాఖ. మొత్తానికి అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఎన్టీపీసీ యాజమన్యానికి రూ.99.28 కోట్ల భారీ జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
India vs Pakistan Army: ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తే.. ఎవరిది గెలుపు.. బలాబలాలు, బలహీనతలు ఇవే..
Amaravati Capital Construction: అమరావతికి నిధులొచ్చాయ్
Read Latest Telangana News And Telugu News