నేటి నుంచి పదిర, కొండాపూర్ ఇసుక రీచ్‌లు ప్రారంభించాలి
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:46 AM
సిరిసిల్ల మానే రు నది పరివాహక ప్రాంతాల్లోని ఎల్లారెడ్డిపేట మండలం పది ర, ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామాల్లోని మంగళవా రం నుంచి ఇసుక రీచ్‌లు ప్రారంభించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.

సిరిసిల్ల కలెక్టరేట్ ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల మానే రు నది పరివాహక ప్రాంతాల్లోని ఎల్లారెడ్డిపేట మండలం పది ర, ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామాల్లోని మంగళవా రం నుంచి ఇసుక రీచ్‌లు ప్రారంభించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం ఇసుక రీచ్‌ల ఏర్పాటుపై కలెక్టరేట్‌లో అధికారులతో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ, పదిర రీచ్ నుంచి ఇసుక రవాణా కోసం అవసరమైన అనుమతులు అందించాల న్నారు. జిల్లాలో మానేరు నది నూతనంగా గుర్తించిన 6 ఇసుక రీచ్‌ల ప్రస్తుత స్థితిగతిపై చర్చించారు. కొండాపూర్ వద్ద ఇసుక కమిటీ సభ్యులు అందించిన నివేదిక ప్రకారం ఒక ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలింపునకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పదిర ఇసుక రీచ్ ప్రారంభించిన తర్వాత వెంకటాపూర్ ఇసుక రిచ్ నిలుపుదలకు చర్యలు చేపట్టాలన్నారు. కొండాపూర్, పదిర ఇసుక రీచ్‌ల ప్రారంభించిన తర్వాత మరోసారి సమావేశం నిర్వహించాలని తెలిపారు. వట్టిమ్టలో అప్రోచ్ రోడ్ సమస్యపై సంబంధిత తహసీల్దార్ నివేదిక అందించాలని తెలిపారు. మంగళవారం నుంచి కొండాపూర్, పదిర ఇసుకరీచ్ ప్రారంభంకావాలని, దీనికి సంబంధించిన మంజూరు పత్రాలు జారీ చేయాలని సూచించారు. సిరిసిల్ల జిల్లాలో నూతనంగా నిర్మించే ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్ల, పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి ఎక్కడ ఇసుక కొరత రాకుండా అప్రమత్తం గా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవో రాధాబాయి, మైనింగ్ అధికారి క్రాం తికుమార్, జిల్లా పంచాయతీ అధికారి షరీఫుద్దిన్, ప్రోగ్రాం అధికారి టీజీఎండీసీ జైపాల్‌రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్‌రెడ్డి, సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.