Share News

న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

ABN , Publish Date - Mar 01 , 2025 | 11:58 PM

విద్యార్థులకు న్యాయసేవలు, చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయమూర్తి టి.శ్రీనివాస్‌రావు అన్నారు. మండల న్యా యసేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వ హించారు.

న్యాయ సేవలపై విద్యార్థులకు అవగాహన ఉండాలి

జ్యోతినగర్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు న్యాయసేవలు, చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయమూర్తి టి.శ్రీనివాస్‌రావు అన్నారు. మండల న్యా యసేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వ హించారు. సచ్‌దేవ పాఠశాలకు చెందిన 9, 10వ తరగతి విద్యా ర్థులు సదస్సులో పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జిడ్డి ప్రసంగిస్తూ విద్యార్థి దశ నుంచే కోర్టులు, విధులు, న్యా య సేవల గురించి తెలుసుకోవాల న్నారు. బాధితులు, కక్షిదారులకు న్యాయపరమైన సహాయాన్ని అందించేందుకు అవసర మైన వ్యవస్థలున్నాయన్నారు. జిల్లా జడ్జి శ్రీనివాస్‌ రావును పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. సచ్‌దేవ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ప్రిన్సిపాల్‌ జ్ఞాన్‌చంద్‌, విద్యార్థు లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2025 | 11:58 PM