Share News

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:05 AM

సీతారా ముల కల్యాణోత్సవం ఆదివారం గోదావరిఖని కోదండ రామాలయంలో అంగరంగవైభవంగా జరి గింది. మినీ భద్రాచలంగా పేరొందిన కోదండ రామాలయం ఆవరణలో కల్యాణ వేదికపై వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యా ణాన్ని వేలాది మంది భక్తజనం కన్నులారా వీక్షిం చి తరించారు.

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

కోల్‌సిటీటౌన్‌, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): సీతారా ముల కల్యాణోత్సవం ఆదివారం గోదావరిఖని కోదండ రామాలయంలో అంగరంగవైభవంగా జరి గింది. మినీ భద్రాచలంగా పేరొందిన కోదండ రామాలయం ఆవరణలో కల్యాణ వేదికపై వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యా ణాన్ని వేలాది మంది భక్తజనం కన్నులారా వీక్షిం చి తరించారు. జైశ్రీరామ నామస్మరణలతో ఆలయ ప్రాం గణమంతా మార్మోగింది. కల్యాణ వేదికపై సీతారాముల ఉత్సవ విగ్రహాలకు ఆలయ ప్రధాన అర్చకులు మధుసూధ నాచార్యులు, అర్చకులు అత్తెణచంద్ర శేఖరశర్మ, గిరిధరా చార్యులు, శశిధరాచార్యులు కల్యాణం నిర్వహించారు. కల్యాణానికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ ఠాకూర్‌-మనాలీఠాకూర్‌ దంపతులు పట్టువ స్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. ఎస్‌సీ జాతీయ కమిషన్‌ సభ్యులు వడ్డేపల్లి రాం చందర్‌, సింగరేణి ఆర్‌జీ-1 జీఎం లలిత్‌కు మార్‌ దంపతులు, ఏసీపీ రమేష్‌, వన్‌టౌన్‌ సీఐలు ఇంద్రసేనారెడ్డి, కె.రవీందర్‌ సీతారా ములను దర్శించుకున్నారు. కల్యాణం అనం తరం ఉత్సవమూర్తులను భక్తులు దర్శించు కున్నారు. భక్తులకు ఇబ్బందులు కల గకుండా ఎమ్మెల్యే ఆలయ కమిటీతో ఏర్పా ట్లు చేయించారు. ఎండ తీవ్రతకు ఇబ్బంది పడకుండా కూలర్లు ఏర్పాటుచేశారు. మాజీ కార్పొరేటర్లు మహాంకాళిస్వామి, బొం తల రాజేష్‌, ముస్తాఫా, బాల రాజ్‌కుమార్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఉత్స వ కమిటీ చైర్మన్‌ గట్ల రమేష్‌, సభ్యులు, ఉల్లంగుల రమేష్‌, ఈవో, సిబ్బంది పాల్గొ న్నారు. ఏసీపీ మడత రమేష్‌ పర్య వేక్షణ లో వన్‌టౌన్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యం లో బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు, సిబ్బం ది రాకపోకలకు ఇబ్బం దులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. పలు స్వచ్ఛంద సం ఘాలు భక్తులకు ఉచితంగా మజ్జిగ, బెల్లంపానకం పంపిణీ చేశారు. విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్తలు సేవలు అందించారు.

కాకతీయనగర్‌లోని అభయాంజనేయస్వామి, చంద్రశేఖ రనగర్‌లోని ఆంజనేయస్వామి, జీఎంకాలనీలోని సంజీవాం జనేయ స్వామి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. మార్కండేయ కాలనీలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద సీతారాముల కల్యాణోత్సవం నిర్వ హించారు. క్తాంజనేయ స్వామి ఆలయంలో దాతల సహకారంతో కల్యాణం నిర్వహించారు.

Updated Date - Apr 07 , 2025 | 12:05 AM