Khammam: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
ABN , Publish Date - Jan 12 , 2025 | 09:30 PM
తెలంగాణ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలడంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది.

ఖమ్మం: తెలంగాణ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)కి పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పేలిపోవడం (Blast Car Tyres)తో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం (Khammam) వస్తుండగా తిరుమలాయపాలెం (Tirumalayapalem) వద్ద కారు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో మంత్రి పొంగులేటితోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో వీరంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాహనాన్ని డ్రైవర్ అదుపు చేయడంతో వీరంతా ఊపరి పీల్చుకున్నారు.